‘కె.జి.ఎఫ్’ రికార్డ్ బ్రేక్ చేసిన కురుక్షేత్రం

Mon 12th Aug 2019 11:48 AM
kurukshetram 3d,movie,kgf record  ‘కె.జి.ఎఫ్’ రికార్డ్ బ్రేక్ చేసిన కురుక్షేత్రం
Kurukshetram 3D Breaks KGF Record ‘కె.జి.ఎఫ్’ రికార్డ్ బ్రేక్ చేసిన కురుక్షేత్రం
Sponsored links

కెజిఫ్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ ‘కురుక్షేత్రం 3D’

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడుగా నటించిన కురుక్షేత్రం, తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. త్రీడీలో తొలిసారిగా రూపొందిన మహాభారత ఇతిహాసాన్ని చూడటానికి కన్నడ అభిమానులే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు, ఇక కన్నడనాట ఈ సినిమా తొలి రోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉన్నాయి. కన్నడలో ఆల్రెడీ రికార్డు సెట్ చేసిన స్టార్ హీరో యాష్.. కెజిఫ్ తొలి రోజు కలెక్షన్స్ ని దర్శన్ కురుక్షేత్రంతో బ్రేక్ చేసాడు. ఈ సినిమాతో తెలుగులో కూడా తన మార్కెట్ ఓపెన్ చేసాడు దర్శన్.  ఈ సినిమా తెలుగు వెర్షన్ లో 25 నిమిషాలు ట్రిమ్ చేశారు. తెలుగు ఆడియన్స్ కి ఈ విజువల్ వండర్ ని ఇవ్వడంలో  త్రివిక్రమ్ సాయి కీలక పాత్ర పోషించారు. తెలుగులో కురుక్షేత్రం కలెక్షన్స్ ప్రస్తుతం స్టడీగా ఉన్నాయి.  కన్నడలో మాత్రం ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని  ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా, ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డం విశేషం. మెట్ట‌మెద‌టిసారిగా ప్ర‌పంచంలోనే మైతలాజికల్ 3డి వెర్ష‌న్ గా ఈచిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రానికి తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సెన్సేషనల్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన రాక్‌లైన్‌ వెంక‌టేష్‌గారి స‌మ‌ర్ప‌ణ‌లో,  వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎన్నోచిత్రాలు క‌న్న‌డ‌లో నిర్మించిన మునిర‌త్న (ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించమే కాకుండా ఈ చిత్ర క‌థ‌ని అందించారు. నాగ‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది.

సంగీతం -- హ‌రికృష్ణ‌

ద‌ర్శ‌కత్వం-- నాగ‌ణ్ణ‌

సమ‌ర్ప‌కుడు -- రాక్‌లైన్ వెంక‌టేష్‌

నిర్మాత‌- మునిరత్న(ఎం ఎల్ ఏ)  

Sponsored links

Kurukshetram 3D Breaks KGF Record:

Kurukshetram 3D Creates Records

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019