Advertisement

నాడు రాములమ్మ.. 28ఏళ్ల తర్వాత ‘మహానటి’!

Sat 10th Aug 2019 02:43 PM
national film awards,mahanati,vijayasanthi,karthavyam,keerthi suresh  నాడు రాములమ్మ.. 28ఏళ్ల తర్వాత ‘మహానటి’!
After 28 Years Gap Tollywood Actress Got National Award నాడు రాములమ్మ.. 28ఏళ్ల తర్వాత ‘మహానటి’!
Advertisement

అదేంటి.. రాములమ్మకు కీర్తిసురేష్‌కు ఏంటబ్బా సంబంధం అనుకుంటున్నారా..? వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేకపోయినా...? ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నాయ్.. ఇందుకు కారణం ఈ ఇద్దరూ జాతీయ అవార్డు దక్కించుకోవడమే. సినిమాల్లోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు.. ఉన్నన్ని రోజులు చేసిన సినిమాలు ఎంత గుర్తింపు తెచ్చాయన్నదే ముఖ్యం.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహానటి’కి జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఒకటి కాదు ఏకంగా మూడు అవార్డులు దక్కడంతో ఇప్పుడు హట్ టాపిక్ అయ్యింది. ఈ అవార్డు తెలుగు చిత్రానికి దక్కడంతో అసలు ఇంతకు ముందు ఎవరెవరికి.. ఏయే చిత్రాలకు అవార్డులు దక్కాయనేది ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు పొందిన తెలుగు నటీమణులు

నీరాజనం (1978): శారద

దాసి (1988) : అర్చన 

కర్తవ్యం (1990): విజయశాంతి

మహానటి(2018): కీర్తిసురేష్

 

కాగా.. 1967లో జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 41 మంది కథానాయికలు 52 సార్లు జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారాలు అందుకున్నారు. వారిలో మన దక్షిణాదిన మాత్రం శారద, అర్చన, శోభన మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు.

After 28 Years Gap Tollywood Actress Got National Award:

After 28 Years Gap Tollywood Actress Got National Award  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement