Advertisementt

నిత్యా మీనన్ అప్పుడే ఇలాంటి పాత్రలోనా..!?

Fri 09th Aug 2019 03:14 PM
nethyamenon,mother role,akshay kumar,mission mangal   నిత్యా మీనన్ అప్పుడే ఇలాంటి పాత్రలోనా..!?
Nethyamenon role in Mission mangal నిత్యా మీనన్ అప్పుడే ఇలాంటి పాత్రలోనా..!?
Advertisement
Ads by CJ

నిత్యా మీనన్.. ఈ పేరు ప్రత్యేకించి మరి పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో నటించి మెప్పించి.. తన ఖాతాలో వేసుకున్న హిట్ చిత్రాలు తక్కువే అయినప్పటికి అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు ప్రస్తుతానికి టాటా చెప్పేసి బాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ నటిస్తున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జగన్ శక్తి తెరకెక్కిస్తుండగా.. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సి పన్ను, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కొల్హారి నటీనటులుగా ఉన్నారు.

ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్ లుక్, ట్రైలర్ మంచి హిట్ టాక్ తెచ్చుకోగా.. తాజాగా నిత్యా మీనన్‌ను సంబంధించిన ఓ పోస్టర్ వదిలారు. ఇందులో నిత్యా ‘వర్షా గౌడ్’ పాత్రను పోషిస్తోంది. కాగా.. వర్షా గౌడ్ గృహిణి కావడం, పిల్లలు ఉండటాన్ని బట్టి చూస్తే తల్లి పాత్రలో నటిస్తున్నట్ల్లు తెలుస్తోంది. నిత్యా అప్పుడే హీరోయిన్ స్టేజ్ దాటిపోయి అప్పుడే ఇలాంటి పాత్రల్లో నటిస్తోంది..? ఏంటి అని ఆమె వీరాభిమానులు కంగుతిన్నారట. 

బాలీవుడ్ కదా..? ఎలాంటి పాత్ర అయినా నటించాలంతే అని అనుకున్న నిత్య ఇలా చేస్తోందట. కాగా.. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే.. నిత్య సైంటిస్ట్ కమ్ వైఫ్‌ అనే రెండు వేరియేషన్స్‌లో చూపించారు. బాలీవుడ్‌లో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం పంద్రాగస్టుకు అభిమానుల ముందుకు రాబోతోంది. సినిమా ఏ రేంజ్‌లో ఉందో.. ఎవరెవరు ఏయే పాత్రల్లో మెప్పించారో తెలియాలంటే ఆగస్ట్-15వరకు వేచి చూడాల్సిందే మరి.

Nethyamenon role in Mission mangal:

Nethyamenon role in Mission mangal  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ