Advertisementt

నాగ్ ఇకనైనా నోరు మెదపరేం.. ఎన్నాళ్లిలా!

Sat 03rd Aug 2019 02:21 PM
akkineni nagarjuna,swethareddy,biggboss-3,allegations  నాగ్ ఇకనైనా నోరు మెదపరేం.. ఎన్నాళ్లిలా!
Why Akkineni Nag Did’not React on these..! నాగ్ ఇకనైనా నోరు మెదపరేం.. ఎన్నాళ్లిలా!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 ఎన్ని వివాదాల మధ్య ప్రారంభమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓ వైపు షో విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ వివాదాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడ్లేదు. అయితే తమను కంటెస్టెంట్లు‌గా తీసుకుని ఫైనల్ చేయకుండా మోసం చేశారని.. లైంగికంగా వేధించారని యాంకర్ శ్వేతారెడ్డి.. నటి గాయత్రీ గుప్తా ఉద్యమిస్తున్నారు. అయితే వీరికి తోడుగా ఉస్మానియా విద్యార్థులు తోడవ్వడంతో శ్వేతారెడ్డి నోటికి అడ్డుఅదుపులేకుండా మాట్లాడేస్తోంది. 

ఇటీవల మీడియా మీట్ నిర్వహించిన శ్వేతారెడ్డి నాగ్‌ను బండ బూతులు తిట్టింది. వెధవా, బ్లూ ఫిల్మ్‌లు ఇలా పెద్ద పెద్ద పదాలే వాడేసింది. అంతేకాదు ఈ వ్యవహారంలోకి నాగ్ సతీమణి అమల, కోడలు సమంతను సైతం లాగింది. ఈ ప్రెస్‌మీట్‌లో ఇంకా రాయలేని మాటలను వాడేసింది. బహుశా ఇలాంటి బూతులు.. వివాదాల్లో ఇరుక్కుంటానని నాగ్ ఇంత వరకూ కలలో కూడా ఊహించి ఉండరమో.!

అయితే ఈ ప్రెస్‌మీట్ చూసిన అక్కినేని అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్వేతారెడ్డికి గట్టి షాకులే ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఫ్యామిలీ జోలికొస్తున్నా నాగ్ మాత్రం నోరుమెదపరెందుకు..? అని అక్కినేని అభిమానులు ఒకింత ఆయనపై కన్నెర్రజేస్తున్నారు. నోరు తెరిస్తే ముత్యాలేం రాలవు సార్.. ఇప్పటి వరకూ ఈ మాటలు.. మున్ముంథు మరెన్ని మాటలు అంటుందో..? ఇకనైనా రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్.. అంటూ ఫ్యాన్స్ నాగ్‌ను వేడుకుంటున్నారు. మరి మన్మథుడు అసలు రియాక్ట్ అవుతాడా..? లేదా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Why Akkineni Nag Did’not React on these..!:

Why Akkineni Nag Did’not React on these..!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ