Advertisementt

నాగశౌర్య.. ‘అశ్వద్ధామ’తో షాకిచ్చాడు

Thu 01st Aug 2019 01:14 AM
ashwaddama,naga shourya,satellite rights,ashwaddama movie  నాగశౌర్య.. ‘అశ్వద్ధామ’తో షాకిచ్చాడు
Ashwaddama Movie Satellite Rights Sold out నాగశౌర్య.. ‘అశ్వద్ధామ’తో షాకిచ్చాడు
Advertisement
Ads by CJ

నటుడు నాగ‌శౌర్య‌కి ఛలో తరువాత ఒక్క హిట్ కూడా రాలేదు. ఛలో తరువాత అతను రెండుమూడు సినిమాలు చేసాడు కానీ అవిఏమి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రీసెంట్ గా ఓ బేబీ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగ‌శౌర్య తాజాగా చేస్తున్న చిత్రం అశ్వద్ధామ. ఇప్పుడీ చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. కారణం ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి క్లోజ్ అవ్వడమే.

ఈమూవీని అక్షరాలా 3 కోట్ల 15 లక్షలతో ఓ ప్రముఖ ఛానల్ కొన్నట్టు సమాచారం. ఇది ఏ యాంగిల్‌లో చూసినా భారీ మొత్తమే. నాగ‌శౌర్య సినిమాకి ఇంతలా రేట్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక ఫస్ట్ లుక్, టీజర్, వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేయకుండా శాటిలైట్‌కి అంత ఆఫర్ రావడం అంటే బంపర్ ఆఫర్ కిందే చెప్పొచ్చు.

ఇక ఈ మూవీ నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్‌లో ఈమూవీ తెరకెక్కుతుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈమూవీ తరువాత శౌర్య రాఘవేంద్రరావు ముగ్గురు దర్శకులతో, మూడు ప్రేమకథలతో తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ అవుతాడు.

Ashwaddama Movie Satellite Rights Sold out :

Shocking Satellite Rights to Ashwaddama Movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ