చిరు.. చిరు.. సర్వం చిరుమయం!!

Sat 27th Jul 2019 11:46 AM
chiru,movies tittles,megastar chiranjeevi,tollywood  చిరు.. చిరు.. సర్వం చిరుమయం!!
News About Chiru Movies Tittles చిరు.. చిరు.. సర్వం చిరుమయం!!
Advertisement
Ads by CJ

అవును ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవరు చూసినా చిరు.. చిరు.. అంటూనే ఉన్నారు.! కొత్త సినిమా తీయాలన్నా.. టైటిల్‌ ఫిక్స్ చేయాలన్నా చిరు పాత సినిమాలే అందరికీ గుర్తొస్తున్నాయ్. చిరు సినిమాల్లో ఏదో పేరు తీసేసుకుంటే పోలా..! అని డైరెక్టర్స్ సైతం అలాగే ఆలోచించి షురూ చేసేస్తున్నారు. ఇప్పటికే చిరు సినిమాల్లోని పలు టైటిల్స్‌ను వాడేసుకున్న విషయం విదితమే.

అయితే ఈ సినిమా పేరు ఎవరెవరికో డైరెక్టర్లు వాడేస్తుండటంతో మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ పేరు ఫిక్స్ చేసినప్పుడు.. ‘నువ్వు గ్యాంగ్ లీడర్‌వా.. మరి మా మెగాస్టారేంటి..? అప్పటికి.. ఇప్పటికీ.. ఎప్పటికీ మా చిరునే కింగ్.. అంతే’ ‌అని మెగా ఫ్యాన్స్ కన్నెర్రజేశారు. ఈ వివాదం ముగియక మునుపే మరోటి చెలరేగింది.

ఇదిలా ఉంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ‘రాక్షసుడు’ టైటిల్ ఫిక్స్ చేసారు. అప్పుడు కూడా వివాదం నడిచినప్పటికీ బయటికి రాలేదు. అయితే తాజాగా చిరుకు బ్రేక్ ఇచ్చిన.. స్టార్‌ను చేసిన ఆల్ టైమ్ హిట్  ‘ఖైదీ’ సినిమా పేరును తమిళ హీరో కార్తీ ఫిక్స్‌ చేసుకున్నాడు. ఇదే పేరుతో అటు తమిళ్‌లో.. ఇటు తెలుగులో సినిమా వస్తోంది. మొత్తానికి చూస్తే సర్వం చిరు మయం అన్న మాట. అయితే చిరు టైటిల్స్‌ను ఇంట్లో వాళ్లు అనగా మెగా హీరోల కంటే బయటోళ్లే గట్టిగా వాడేస్తున్నారన్న మాట.

News About Chiru Movies Tittles:

News About Chiru Movies Tittles

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ