Advertisementt

‘సాహో’కి పోటీగా వచ్చేందుకు ఫిక్సయ్యారు

Thu 25th Jul 2019 05:55 PM
saaho,bandobasth,kaappaan,release date,prabhas,suriya,kollywood  ‘సాహో’కి పోటీగా వచ్చేందుకు ఫిక్సయ్యారు
Interesting Fight between Prabhas and Suriya ‘సాహో’కి పోటీగా వచ్చేందుకు ఫిక్సయ్యారు
Advertisement
Ads by CJ

సౌత్‌లో కొన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది సూర్యకి. తెలుగులో అయితే చెప్పుకోదగ్గ మార్కెట్ కూడా ఉంది. అయితే కొన్ని ఏళ్ళ నుండి సూర్యకి సరైన విజయం లేక మార్కెట్ డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తన నుండి ఓ సినిమా వస్తుంది. అదే ‘కాప్పన్’ (తెలుగులో బందోబస్త్). 

మొదట ఈమూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అదే రోజు ప్రభాస్ ‘సాహో’ కూడా ఉండడంతో ఎందుకులే రిస్క్ అని ఆగస్టు 30కి షిఫ్ట్ అయ్యారు. తీరా ప్రభాస్ కూడా ఆగస్టు 30కి షిఫ్ట్ అవ్వడంతో ‘కాప్పన్’ ను వాయిదా వేద్దామా వద్దా అని ఆలోచనలో పడ్డారు మేకర్స్. 30న అనుకునే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా చాలా స్లో గా చేస్తున్నారు. సో ఏదైతేనేం అని ‘కాప్పన్’ను ఆగస్టు 30నే రిలీజ్ చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయిపోయింది.

‘సాహో’ వస్తే మాకు భయం ఏంటి అన్న రీతిలో వెళ్తున్నారు. ‘సాహో’ చిత్రం వల్ల తమ సినిమాకి ఎంత నష్టమో.. తమ సినిమా వల్ల ‘సాహో’కి కూడా అంతే నష్టం అని యేవో లెక్కలు వేసుకున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లిపోదామని ‘కాప్పన్’ టీం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో మోహన్ లాల్ నటిస్తున్నారు కాబట్టి మలయాళంలో ఈ సినిమాకి డోకా లేదు. అలానే తమిళంలో సూర్యకి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ సినిమాకి తిరుగులేదు. కాకపోతే తెలుగులోనే వసూళ్లు విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సివస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?

Interesting Fight between Prabhas and Suriya:

Suriya Kaappaan vs Prabhas Saaho

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ