ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌

Wed 24th Jul 2019 02:31 AM
singer smitha,20 years,journey,event,update  ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌
Singer Smitha 20 Years Journey Event Update ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌
Sponsored links

గ్రాండ్‌గా సింగ‌ర్ స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

సింగర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన స్మిత ఈ ఏడాదితో 20 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ‘ఎ జ‌ర్నీ 1999-2019’ అనే పేరుతో వేడుక‌ను నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె తొలి ఇండిపాప్ కావ‌డం విశేషం. ఈ వేడుక‌కు కింగ్ నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, నేచుర‌ల్ స్టార్ నాని, అల్ల‌రి నరేశ్‌, న‌వ‌దీప్‌, ఎం.ఎం.కీర‌వాణి, కళ్యాణ్ మాలిక్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి, దేవాక‌ట్టా, విష్ణు ఇందూరి ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. సింగర్ కొన్ని పాటలను లైవ్ క‌న‌స‌ర్ట్‌లో పెర్ఫామ్‌ చేసి అతిథులను ఆకట్టుకున్నారు. 

1996లో పాడుతా తీయగా కోసం పాటలు పాడటం ద్వారా స్మిత వెలుగులోకి వచ్చారు. అప్పటి నుండి నేటి వరకు అదే ఉత్సాహంతో పాట‌లు పాడుతూ ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తున్నారు. 1999లో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున ‘యువ‌ర్ హాన‌ర్‌’ అనే షో ప్రోమోను ఆవిష్క‌రించారు. ఈ షోకు స్మిత యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ షో ద్వారా స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు.

Sponsored links

Singer Smitha 20 Years Journey Event Update:

Singer Smitha Live Music Concert Became Grand Success

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019