‘రాక్షసుడు’ని రెండు వైపులా బిగించారుగా!

Tue 23rd Jul 2019 07:54 PM
bellamkonda srinivas,rakshasudu movie,release details,full competition,manmadhudu 2,dear comrade  ‘రాక్షసుడు’ని రెండు వైపులా బిగించారుగా!
Full Competition to Bellamkonda Srinivas Rakshasudu Movie ‘రాక్షసుడు’ని రెండు వైపులా బిగించారుగా!
Sponsored links

ఇస్మార్ట్ శంకర్ టైములో రిలీజ్ అవ్వాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు. కానీ బెల్లంకొండ రేంజ్ కి ఇస్మార్ట్ శంకర్ పెద్ద సినిమా కాబట్టి సైడ్ కి వెళ్ళాడు. ఏకంగా రెండు వారాలు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆగష్టు 2న రాక్షసుడు సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి వారంకి ముందు యంగ్ అండ్ సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది.

విజయ్ క్రేజ్ గురించి తన మార్కెట్ గురించి వేరే చెప్పనవసరం లేదు. డియర్ కామ్రేడ్ ఎలాగో ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ పరిస్థితి అలాంటిది కాదు. మొదటి నుండి ఫుల్ డౌన్ లో ఉన్న శ్రీనివాస్ సినిమా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. సినిమా బాగుందని టాక్ వచ్చి బాగా ప్రమోట్ చేస్తే తప్ప.. కష్టమే అంటున్నారు ట్రేడ్ వారు.

పైగా ఈసినిమాకి పోటీగా గుణ 369 సినిమా ఉంది. సో ఓపెనింగ్స్ కష్టమే. రాక్షసుడు వచ్చిన వారానికి నాగార్జున మన్మథుడు 2 సినిమా వచ్చేస్తోంది. అంటే ముందు వారం, తర్వాత వారం కూడా ఫుల్ కాంపిటీషనే. ఇక ఆగస్టు 15న శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు సినిమాలు వున్నాయి. ఇలా మధ్యలో నలిగిపోతున్నాడు శ్రీనివాస్. అసలే హిట్ లేక తమిళ సినిమాని రీమేక్ చేసి హిట్ కొడదాం అంటే సినిమాల పోటీ తప్పడమేలేదు. మంచి ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం ఈ ‘రాక్షసుడు’ రిలీజ్ డేట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 

Sponsored links

Full Competition to Bellamkonda Srinivas Rakshasudu Movie :

Bellamkonda Srinivas Rakshasudu Movie Release on August 2nd

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019