‘సాహో’ నుంచి స్టన్నింగ్ పోస్టర్ వదిలారు

Tue 23rd Jul 2019 07:40 PM
saaho,stunning look,prabhas,instagram,saaho movie new poster,young rebel star  ‘సాహో’ నుంచి స్టన్నింగ్ పోస్టర్ వదిలారు
Stunning Look From Saaho released ‘సాహో’ నుంచి స్టన్నింగ్ పోస్టర్ వదిలారు
Sponsored links

స్ట‌న్నింగ్ ‘సాహో’ పోస్ట‌ర్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్   

‘బాహుబలి’ చిత్రం తర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. అస‌లు ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి తిరిగింది. ప్ర‌భాస్.. సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోసం సాహో మూవీ గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ వారిని అల‌రిస్తున్నాడు. ఈరోజు(జూలై 23) స్ట‌న్నింగ్ రొమాంటిక్ పోస్ట‌ర్‌ని పోస్ట్ చేశాడు. ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము అనే సందేశంతో హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ కి నెటిజ‌న్ లు ఫిదా అయిపోయారు. ఇక డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. ఇప్పటి వ‌ర‌కూ వ‌చ్చిన సాహో ప్ర‌మోష‌న్ అంతా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా క‌నిపించినా ఇప్పుడు వ‌చ్చిన ఈ పోస్ట‌ర్ లో ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ క‌నిపించ‌డం విశేషం. సాహోలో ఇంకా షేడ్స్ వున్నాయని విడుద‌ల తేది లోపు సాహోలో వున్న షేడ్స్ ఆప్ సాహో ద్వారా తెలియ‌జేస్తాం అని యూనిట్ స‌భ్యులు అంటున్నారు. ఈ చిత్రం ఇండియాలో మొట్ట‌మొద‌టిగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరకెక్కతోంది. బాహుబలి చిత్రం త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటీతో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ విఎఫ్‌ఎక్స్‌ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి మొద‌టి సింగిల్‌ని విడుద‌ల చేశారు. రెండ‌వ సింగిల్‌ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తున్నారు. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు.

Sponsored links

Stunning Look From Saaho released:

Saaho Movie Latest Poster Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019