ఢిల్లీ వెళ్లబోతోన్న ‘డిస్కోరాజా’!

Mon 22nd Jul 2019 07:57 PM
disco raja,mass maharaja,raviteja,delhi shooting  ఢిల్లీ వెళ్లబోతోన్న ‘డిస్కోరాజా’!
Disco Raja Movie Latest Update ఢిల్లీ వెళ్లబోతోన్న ‘డిస్కోరాజా’!
Sponsored links

కోటి ఇర‌వై ల‌క్ష‌ల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న మాస్‌మ‌హ‌రాజ్ ‘డిస్కోరాజా’ ఆగస్ట్ మొద‌టివారం ఢిల్లీలో షూట్‌

మాస్ మహారాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’‌. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ ఏడెక‌రాల‌లో కోటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహోప్‌లపై సినిమాలోని అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్‌ని డైరెక్ట్‌గా థియేట‌ర్‌లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త‌గా ఉంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి... రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘‘నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజగారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ లో రవితేజ గారు, వెన్నెల కిషోర్ ల మ‌ధ్య జ‌రిగే కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాము. ఈ నెల 26తో ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుంటాము. ఆగస్ట్ మొద‌టివారం నుండి ఢిల్లీలో షూటింగ్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్‌లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతారు. ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ గొప్ప విజ‌న్ వున్న వ్య‌క్తి. పూర్తి వినోదాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుంది.. ’’అని అన్నారు

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంట‌ర్‌టైన్మెంట్స్

నిర్మాత: రామ్ తాళ్లూరి

ద‌ర్శ‌కుడు: విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్: సాయి శ్రీరామ్

డైలాగ్స్: అబ్బూరి రవి

మ్యూజిక్: థ‌మన్

ఎడిట‌ర్: న‌వీన్ నూలి

పీఆర్ఓ: ఏలూరు శ్రీను

Sponsored links

Disco Raja Movie Latest Update:

Disco Raja Movie shooting Starts in Delhi from August 1st week

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019