కొరటాల నిర్మాతగా మహేశ్‌ సినిమా!!

Koratala Turned As a producer With Mahesh Movie!

Mon 22nd Jul 2019 07:26 PM
koratala shiva,mahesh babu,parasuram,mahesh new movie  కొరటాల నిర్మాతగా మహేశ్‌ సినిమా!!
Koratala Turned As a producer With Mahesh Movie! కొరటాల నిర్మాతగా మహేశ్‌ సినిమా!!
Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం కొరటాల దర్శకత్వంలో తెరెక్కిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలే. అయితే ఈ కాంబోలో సినిమా తెరకెక్కడంతో పాటు సూపర్ డూపర్ హిట్టవ్వడంతో వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. మహేశ్ కోసం త్వరలోనే కొరటాల నిర్మాతగా మారబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇక అసలు విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నటీనటులుగా పరుశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ హిట్టయిన విషయం విదితమే. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్ సినిమా తీయాలని పరుశురామ్ ఫిక్స్ అయినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు.. మహేశ్ కూడా కథ విని ‘తర్వాత సినిమా మీతోనే’ అన్నారని టాక్ నడిచింది.

అయితే తాజాగా.. మహేశ్-పరుశురామ్ కాంబోలో తీయాలనుకున్న కథను ఇప్పటికే కొరటాల విని నిర్మాతగా వ్యవహరిచడానికి తాను సిద్ధమని చెప్పేశారట. ఈ కాంబో కలిస్తే ఇక సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇక ఊహించనక్కర్లేదు. అంతేకాదు.. అవసరమైతే కథలో మార్పులు చేర్పులు చేసుకుని మరీ కొరటాల హిట్ కొట్టేయడం మాత్రం పక్కా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఎంత వరకు నిజమో.. అనేది తెలియాలంటే అధికార ప్రకటన వెలువడేదాకా వెయిట్ చేయాల్సిందే.

Koratala Turned As a producer With Mahesh Movie!:

Koratala Turned As a producer With Mahesh Movie!


Loading..
Loading..
Loading..
advertisement