బిగ్‌బాస్-3 విన్నర్ కూడా పవన్ వీరాభిమానేనా!

Mon 22nd Jul 2019 06:19 PM
pawan kalyan,die hard fan bigg boss-3,sree mukhi  బిగ్‌బాస్-3 విన్నర్ కూడా పవన్ వీరాభిమానేనా!
Will Pawan Die Hard fan wins Bigg Boss-3 Title! బిగ్‌బాస్-3 విన్నర్ కూడా పవన్ వీరాభిమానేనా!
Sponsored links

అవును ఫస్ట్, సెకండ్ సీజన్‌లాగే మూడో సీజన్‌లో కూడా టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానే విన్నర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట. అసలు ఇంతకీ ఆ వీరాభిమాని ఎవరు..? బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారిలో పవన్ అభిమాని ఎవరబ్బా..? అని ఆలోచిస్తున్నారా..? ఇక ఆలస్యమెందుకు ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పవన్‌కు కోట్లల్లో వీరాభిమానులు, డైహర్డ్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా తోడయ్యారు. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ లేడీ యాంకర్‌ శ్రీముఖి విన్నరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి ఆమె పవన్‌ భక్తురాలు.. ఆయనంటే పడిచచ్చేంత అభిమానం కూడా ఉంది. ఈమె పేరిట ఇప్పటికీ శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పేజీలు సైతం ప్రారంభించడం జరిగింది.

సో.. ఇదే నిజంగా జరిగితే మొదటి సీజన్‌లో పవన్ వీరాభిమాని శివ బాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్.. ఇక మూడో సీజన్‌లో లేడీ యాంకర్ ముగ్గురూ కూడా జనసేనాని అభిమానులే అవుతారన్న మాట. అంతేకాదు.. లేడీగా మొదటి విన్నర్‌గా శ్రీముఖి రికార్డ్ సృష్టించిన వారవుతారు కూడా. మొదటి రెండు షోలు సక్సెస్ కావడానికి పవన్ వీరాభిమాని విన్నర్ అవ్వడానికి జనసేనాని ఫ్యాన్స్ అన్నది ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే వరుసగా మూడోసారి కూడా ఇదే సెంటిమెంట్ పండుతుందా..? పవన్ వీరాభిమానే గెలుస్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Will Pawan Die Hard fan wins Bigg Boss-3 Title!:

Will Pawan Die Hard fan wins Bigg Boss-3 Title!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019