‘మ‌న్మ‌థుడు 2’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mon 22nd Jul 2019 01:21 PM
manmadhudu 2,trailer,release,july 25  ‘మ‌న్మ‌థుడు 2’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Manmadhudu 2 Trailer Release Date Fixed ‘మ‌న్మ‌థుడు 2’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Sponsored links

జూలై 25న నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘మ‌న్మ‌థుడు 2’ ట్రైల‌ర్ 

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో టీజ‌ర్‌కి.. అవంతిక అనే పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌లై హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఈ నెల 25న ఈ సినిమా ట్రైల‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

న‌టీన‌టులు:

కింగ్ నాగార్జున‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ల‌క్ష్మి

వెన్నెల‌కిషోర్‌

రావు ర‌మేష్‌

ఝాన్సీ

దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: 

ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌

నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌

నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌

మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌

స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌

ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి

డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌

కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌:  సి.వి.రావ్‌

Sponsored links

Manmadhudu 2 Trailer Release Date Fixed:

Manmadhudu 2 Trailer Release on July 25th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019