అనుష్క ‘నిశ్శబ్దం’గా వస్తోంది

Sun 21st Jul 2019 04:32 PM
anushka,nishabdham,movie,title look,released  అనుష్క ‘నిశ్శబ్దం’గా వస్తోంది
Nishabdham Movie Title Look Released అనుష్క ‘నిశ్శబ్దం’గా వస్తోంది
Sponsored links

తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది చివ‌రిలో విడుదల కానున్న

అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రచార చిత్రం  విడుదల

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి  క్రాస్ ఓవ‌ర్ చిత్రం  ‘నిశ్శబ్దం’. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. సుప్రసిద్ధ నాయిక అనుష్క శెట్టి న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ‘నిశ్శబ్దం’ టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు. 

అమెరికాలోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ అండ్ మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ - నీర‌జ కోన‌, స్టంట్స్ - ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ - షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ - హేమంత్ మ‌ధుక‌ర్; సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్

Sponsored links

Nishabdham Movie Title Look Released:

Anushka Nishabdham Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019