‘వినయ విధేయ రామ‌’ ప్లాప్‌తో భలే కలిసొచ్చింది

Sat 20th Jul 2019 10:49 PM
kiara advani,busy,heroine,bollywood  ‘వినయ విధేయ రామ‌’ ప్లాప్‌తో భలే కలిసొచ్చింది
Kiara Advani Busy after VVR Flop ‘వినయ విధేయ రామ‌’ ప్లాప్‌తో భలే కలిసొచ్చింది
Sponsored links

తెలుగు మొదటి సినిమాతోనే మహేష్ లాంటి స్టార్ట్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు తరువాత తెలుగు మళ్లీ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. ఇక లేటెస్ట్ గా ఈమె  కబీర్‌ సింగ్‌తో యువతని విశేషంగా ఆకట్టుకుంది. 

సినిమాల్లో బోల్డ్ నెస్ చూపించే కియారా బికినీలో కనిపించడానికి కూడా సై అంటుంది. అందుకే బాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇప్పటికే ఆమెతో రెండు పెద్ద సినిమాలకి సైన్‌ చేయించుకున్నాడు. దీపికా, ప్రియాంక, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈమెకు క్రేజ్ పెరిగింది.

తెలుగులో వినయ విధేయ రామ డిజాస్టర్‌ అవడంతో ఈమెకు ఇక్కడ అవకాశాలు రావడంలేదు. ఇది ఒకరకంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే వినయ విధేయ రామ హిట్ అయివుంటే ఇక్కడే సినిమాలు చేసుకునేది. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చేవి కాదు. ఇలా వరస సినిమాలతో బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో ఇప్పటిలో సినిమాలు చేసే అవకాశాలు తక్కువే అని అర్ధం అవుతుంది.

Sponsored links

Kiara Advani Busy after VVR Flop:

Kiara Advani Busy Heroine in Bollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019