ఆ సినిమా స్టోరీ చెప్పేసిన ఉపరాష్ట్రపతి!

Sat 20th Jul 2019 10:16 PM
vice president,venkaiah naidu,bollywood,super 30 movie,story  ఆ సినిమా స్టోరీ చెప్పేసిన ఉపరాష్ట్రపతి!
Venkaiah Naidu Tells Bollywood Movie Story ఆ సినిమా స్టోరీ చెప్పేసిన ఉపరాష్ట్రపతి!
Sponsored links

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా ఓ సినిమాని ఆసక్తిగా తిలకించారట. అది కూడా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాని వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా క్యూబ్ ద్వారా తిలకించారట. అయితే తాజాగా వెంకయ్యనాయుడు గోరా శాస్త్రి శత జయంతి ఉత్సవాలు సందర్బంగా.... సీనియర్ జర్నలిస్ట్ లు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన సూపర్ 30  సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 

అసలు సినిమాలు చూడడం మానేసిన తాను.. ఒక సినిమాని 2.30 గంటల పాటు ఎలా చూడగలనో అనుకున్నానని.. కానీ సూపర్ 30 సినిమాని చూస్తున్నంత సేపు తనకు చాలా బాగా అనిపించిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ మాటల్లో మాటగా ఆయన సూపర్ 30 స్టోరీ మొత్తం మీడియాకి వివరించేయడం ఆసక్తిగా మారింది. హీరో 30మందిని దత్తత తీసుకుని వారికి చదువు చెప్పించటానికి పడ్డ కష్టం, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటి వంటి అంశాలు ఎంత ప్రాధాన్యత  ఉంటుందో ఈ సినిమాలో చూశామని చెప్పారు. మరి హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 గతవారమే విడుదలై భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా దూసుకుపోతుంది.

Sponsored links

Venkaiah Naidu Tells Bollywood Movie Story:

Vice President Praises Super 30 Movie  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019