పూరీ ‘ఇస్మార్ట్’ సక్సెస్.. కిస్ ఇచ్చిన ఆర్జీవీ!

Sat 20th Jul 2019 08:46 PM
rgv,ismart shankar,purijagannadh,kiss  పూరీ ‘ఇస్మార్ట్’ సక్సెస్.. కిస్ ఇచ్చిన ఆర్జీవీ!
RGV celebrates Ismart Shankar’s success with a kiss పూరీ ‘ఇస్మార్ట్’ సక్సెస్.. కిస్ ఇచ్చిన ఆర్జీవీ!
Sponsored links

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇస్మార్ట్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మంచి హిట్ టాక్ రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగితేలుతోంది. మరోవైపు పూరీ కూడా చాలా రోజుల తర్వాత హిట్‌ తన ఖాతాలో పడిందని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. 

2015లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో పూరీ భారీ హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసిన వివాదాస్పద దర్శకుడు, పూరీజగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ.. శిష్యుడ్ని మెచ్చుకున్నాడు. తన యూనిట్‌తో కలిసి సక్సెస్‌ను పూరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 

సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఈ సందర్భంగా తన గురువుకు పూరీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. తన శిష్యుడి సక్సెస్‌ను ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్న వర్మ.. పార్టీలో భాగంగా పూరీ చెంపపై గట్టిగా హగ్ చేసుకుని ముద్దిచ్చాడు. కాగా.. ఆడ అయినా మగ అయినా ఆర్జీవీకి ముద్దువివ్వడం పరిపాటే అన్న విషయం తెలిసిందే. కాగా పూరీ-ఆర్జీవీల ముద్దు వ్యవహారానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్ఁం కురిపిస్తున్నారు.

Sponsored links

RGV celebrates Ismart Shankar’s success with a kiss:

RGV celebrates Ismart Shankar’s success with a kiss

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019