‘ఇస్మార్ట్’ శ్రీను చాలా ఆనందంగా ఉన్నాడు

Sat 20th Jul 2019 05:55 PM
distributor ismart srinu,karthikeya distributor,kabali,husharu,ismart shankar,happy  ‘ఇస్మార్ట్’ శ్రీను చాలా ఆనందంగా ఉన్నాడు
Distributor Ismart Srinu Happy with Ismart Shankar Hit ‘ఇస్మార్ట్’ శ్రీను చాలా ఆనందంగా ఉన్నాడు
Sponsored links

‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది!- డిస్ట్రిబ్యూట‌ర్ ‘ఇస్మార్ట్’ శ్రీను

పెద్ద మొత్తం డ‌బ్బుతో పాటు అద‌నంగా న‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌డిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు వ‌స్తే వ‌చ్చిన‌ట్టు. ఆ స‌ద‌రు సినిమా ప్రేక్ష‌కుడికి న‌చ్చ‌క‌పోతే మ‌న చేతులు కాలిన‌ట్టు. అందుకే ఈ వ్యాపారంలో న‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. ఈ మ‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా అలా న‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని త‌న‌వెంట పెట్టుకుని ‘ఇస్మార్ట్’గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్న‌టిదాకా ఆయ‌న కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను.... ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి ‘ఇస్మార్ట్’ శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లుగా, పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో రామ్ తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టిన ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ఆయ‌న‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా హ్యాట్రిక్ చిత్ర‌మ‌న్న‌మాట‌.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తున్న ఈ చిత్రం గురించి, త‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీను మాట్లాడుతూ.. ‘‘మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ త‌ర‌ఫున నైజామ్‌లో మొద‌ట ‘క‌బాలీ’ చేశాను. ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి క‌లెక్ష‌న్లు తెచ్చింది. ఆ త‌ర్వాత ‘హుషారు’ డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో ‘హుషారు’ కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది. ‘ఉండిపోరాదే....’ అంటూ స‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. స‌క్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆ క్ష‌ణాల్లోనే బ‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి జ‌గ‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ రూపొందుతున్న‌ప్ప‌టి నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూట్ కొత్త‌గా అనిపించింది. సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని క‌లిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్‌ను ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి బ‌య‌ట‌కొస్తున్న ఫ్యాన్స్ ‘పూరిగారి పోకిరి చిత్రం గుర్తుకొస్తోంది’ అని అంటున్నారు. ‘పోకిరి’ రోజులంటే క‌లెక్ష‌న్ల సునామీ అన్న‌మాటే. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ ‘ఇక నిన్ను అంద‌రూ ఇస్మార్ట్ శ్రీను అంటారు. అదే పేరుతో పాపుల‌ర్ అవుతావు’ అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం క‌లిగించాయి. ‘ఆర్‌.ఎక్స్.100’ కార్తికేయ హీరోగా న‌టించిన ‘గుణ 369’ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కులు తీసుకున్నా. అదొక య‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌వ విలువ‌ల్ని ట‌చ్ చేసే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన ‘క‌బాలి’, ‘హుషారు’, ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’....ఈ మూడు సినిమాల విష‌యంలో నా అంచ‌నాలు త‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌య‌ప‌రంప‌ర‌ను ‘గుణ 369’ కొన‌సాగిస్తుంద‌ని నా న‌మ్మ‌కం. భ‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును ‘ఇస్మార్ట్’గా నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా’’ అని చెప్పారు.

Sponsored links

Distributor Ismart Srinu Happy with Ismart Shankar Hit:

Distributor Ismart Srinu Hat-trick Hits

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019