తెలుగులో ఈసారైనా ‘మిస్టర్ కెకె’ మెప్పిస్తాడా..!?

Thu 18th Jul 2019 01:16 PM
vikram,satisfaction,fans,mr kk movie  తెలుగులో ఈసారైనా ‘మిస్టర్ కెకె’ మెప్పిస్తాడా..!?
Will Vikram satisfaction Fans these Mr KK movie! తెలుగులో ఈసారైనా ‘మిస్టర్ కెకె’ మెప్పిస్తాడా..!?
Sponsored links

టాలీవుడ్‌లో ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’ చిత్రాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విక్రమ్. ఈ హీరోకు సరైన హిట్టు పడి చాలా రోజులే అవుతోంది. అయితే తాజాగా ‘మిస్టర్ కెకె’ తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. ఈ ప్రయోగత్మక చిత్రం ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గత చిత్రాలు కొన్ని ఆశించిన స్థాయిలో లేకపోవడం నిజమేనని.. అయితే ‘స్కెచ్’.. ‘సామి 2’ సినిమాలు తమిళంలో బాగానే ఆడాయని చెప్పుకొచ్చాడు. ఎందుకో తెలుగువారు తన సినిమాలను ఆదరించడం లేదనిపిస్తోందని.. అయితే ‘మిస్టర్ కెకె’ సినిమాకి వాళ్ల ఆదరణ తప్పకుండా లభిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

కాగా.. ‘మిస్టర్ కెకె’ లో అక్షర హాసన్ .. అభిహాసన్ .. లేనా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయట. అంతేకాదండోయ్.. కొంత కథ నడిచేవరకూ ఈ సినిమాలో విక్రమ్ హీరోనా? విలనా? అనే అయోమయానికి ప్రేక్షకులు లోనవుతారట. ఈ కన్ఫూజ్‌ అనేది సినిమా ప్రియులను థియేటర్ల దాకా రప్పిస్తుందా..? లేకుంటే మళ్లీ విక్రమ్ కథ మొదటికొస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Will Vikram satisfaction Fans these Mr KK movie!:

Will Vikram satisfaction Fans these Mr KK movie!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019