అలీకి టీటీడీ మెంబర్‌ పదవి ఎందుకివ్వకూడదు!?

Thu 18th Jul 2019 03:00 AM
mahesh kathi,lord venkateswara,comedian ali,ttd membership  అలీకి టీటీడీ మెంబర్‌ పదవి ఎందుకివ్వకూడదు!?
mahesh kathi controversy comments on lord venkateswara over comedian ali ttd membership అలీకి టీటీడీ మెంబర్‌ పదవి ఎందుకివ్వకూడదు!?
Sponsored links

ఇదేంటి మొన్నటి దాకా ‘కమెడియన్ అలీకి వైఎస్ జగన్ డబుల్ ధమాకా!!’ అని ఇప్పుడు మళ్లీ టీటీడీ పదవి అనుకుంటున్నారు..? ఇది ఇచ్చే పదవి కాదండోయ్.. టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్ మదిలోని మాట. వివాదాలే ఊపిరిగా ఉండే కత్తి.. పుట్టలో వేలుపెట్టి మరీ కరిపించుకోవడం ఆయనకు సరదా.! అందుకే ఇప్పటికే పలు వివాదాల్లో తలమునకలై పడి లేచిన కత్తి.. ఇప్పుడు తాజాగా కమెడియన్ అలీని కెలుకుతున్నాడు.

గత కొన్ని రోజులుగా అలీకి ఫలానా పదవి ఇస్తున్నారు..? ఇదిగో రేపే ఇచ్చేస్తున్నారు..? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ టాపిక్‌ను డైవర్ట్ చేసి.. వార్తల్లో నిలవాలనుకున్నాడేమో కానీ.. కత్తి రంగంలోకి దిగిపోయి హడావుడి మొదలెట్టేశాడు.

ఇంతకీ కత్తి బాధేంటి!?

"నటుడు ఆలీకి కీలకపదవి : టిటిడి బోర్డు మెంబర్ల కోసం మల్లగుల్లాలు. ఇవి రెండూ వేరువేరు వార్తలు. కానీ రెంటినీ కలిపి ఆలీకి హిందూదేవాలయమైన తితిదే నిర్వాహమండలిలో స్థానం ఎలా కల్పిస్తారు? అని కొందరు అనవసరపు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అయినా అయ్యలూ! వేంకటేశ్వరుడు బీబీనాంచారమ్మని పెళ్లిచేసుకోగా లేనిది, ఆలీకి నిజంగానే తితిదే మెంబర్షిప్ ఇస్తే మాత్రం తప్పేంది?!?" అని కత్తి తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. అయితే ఈ వ్యవహారంపై హిందూ పరిషత్ సంఘాలు, మఠాధిపతులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

mahesh kathi controversy comments on lord venkateswara over comedian ali ttd membership:

mahesh kathi controversy comments on lord venkateswara over comedian ali ttd membership

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019