స్టార్ హీరో సినిమాతో సొంతింటికి బండ్ల గణేష్!

Wed 17th Jul 2019 11:23 PM
bandla ganesh,star hero movie,tollywood,politics  స్టార్ హీరో సినిమాతో సొంతింటికి బండ్ల గణేష్!
Bandla Ganesh Again Acting Started With Star hero movie! స్టార్ హీరో సినిమాతో సొంతింటికి బండ్ల గణేష్!
Sponsored links

ఎన్నెన్ని ఊర్లు తిరిగినా.. ఎక్కడికి వలసెల్లినా చివరికి సొంతూరికి రావాల్సిందే. అది కష్టాల్లో వచ్చామా..? కష్టాలు, నష్టాలన్నీ అనుభవించేసి హాయిగా ఎంజాయ్ చేయడానికి వచ్చామా..? అనేది పాయింట్ కాదు.. ఫైనల్‌గా సొంతూరుచ్చామా లేదా అనేదే ముఖ్యం. సేమ్ టూ సేమ్ ఇప్పుడు టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాతగా పేరుగాంచిన బండ్ల గణేష్ పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్ ఇదే.. ఇంతకీ ఆ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

చిన్నపాటి జూనియర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ అనతికాలంలోనే ఎక్కడికో ఎదిగిపోయాడు. ఒక్క సినిమాల్లోనే కాదండోయ్ నిర్మాణ, రాజకీయ రంగాల్లో తన అదృష్టాన్ని పరిశీలించుకున్నాడు. అయితే నిర్మాతగా గ్రాండ్ సక్సెస్ అయిన బండ్ల.. రాజకీయాల్లో టోటల్‌గా అట్టర్ ప్లాప్ అయ్యాడు. దెబ్బకు దెయ్యం వదిలిందన్నట్లు.. రాజకీయాలొద్దు బాబాయ్.. అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చేశాడు. ఇక చేసేదేముంది మళ్లీ ముఖానికి రంగేయడం తప్ప. కాంగ్రెస్‌లో ఉన్ననాళ్లు ఈయన చేసిన హడావుడి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో సినిమాతో బండ్ల మళ్లీ ముఖానికి రంగేసుకుని రీ ఎంట్రీ ఇస్తున్నాడని ఫిల్మ్ నగర్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో మంచి పాత్ర కావడంతో కాదనకుండా నటించేస్తున్నారట. అయితే ఈ స్టార్ హీరో సినిమాతోనే బండ్ల సరిపెట్టుకుంటారా..? లేకుంటే కంటిన్యూ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఈయన నటించడం కంటే నిర్మాతగానే నాలుగు రూపాయిలు సంపాదించుకునే వ్యక్తన్న విషయం తెలిసిందే.

Sponsored links

Bandla Ganesh Again Acting Started With Star hero movie!:

Bandla Ganesh Again Acting Started With Star hero movie!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019