గురువు కాన్ఫిడెన్స్ ఓకే.. మరి జగన్ సంగతేంటి!?

Wed 17th Jul 2019 06:53 PM
ramgopal varma,puri jagannadh,ismart shankar,ram pothineni  గురువు కాన్ఫిడెన్స్ ఓకే.. మరి జగన్ సంగతేంటి!?
Rgv Full Confidence on Puri’s Ismart Shankar! గురువు కాన్ఫిడెన్స్ ఓకే.. మరి జగన్ సంగతేంటి!?
Sponsored links

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’. ఈ నెల 18 ఇస్మార్ట్‌గా థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు రామ్. హిట్ అకౌంట్‌లో చాలా కాలం కావడంతో జగన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మరీ చేసి.. ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఈ సినిమా ప్రమోషన్స్ ఎలాగో జరిగిపోతున్నాయ్.. ఇప్పటి వరకూ అంతా ఓకే గానీ.. పూరీలో మాత్రం టెన్షన్ మొదలైందట. సినిమా జనాలకు నచ్చుతుందా..? లేదా..? అని అటు చార్మీకి ఇటు పూరీకి ఒక్కటే టెన్షనట. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ లుక్ మొదలుకుని.. ఇప్పటి వరకూ భారీగానే అంచనాలున్నాయ్.. పైగా పూరీ సినిమా కదా..? అంచనాలు గట్టిగానే ఉన్నప్పటికీ పూరీలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ కొరువైంది.

పూరీ సంగతేమో కానీ ఆయన గురువు రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. ట్విట్వర్ వేదికగా ఇస్మార్ట్ శంకర్ గురించి రాసుకొచ్చారు. ‘ ఇస్మార్ట్ శంకర్.. చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా సూపర్ సక్సెస్ మెరుపు అనేది పూరీ జగన్నాథ్ ముఖంలో ఇప్పటికే నాకు కనిపించింది’ అని ఆర్జీవీ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. అయితే సినిమా హిట్ అవుతుందా..? లేదా ఫట్ అవుతుందా అనేది మాత్రం మరికొన్ని గంటల్లో తేలిపోనుందన్న మాట.

Sponsored links

Rgv Full Confidence on Puri’s Ismart Shankar!:

Rgv Full Confidence on Puri’s Ismart Shankar!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019