చిరు, ప్రభాస్‌లను వారు లెక్కచేయడం లేదుగా!

Tue 16th Jul 2019 07:59 PM
sye raa,saaho,prabhas,chiranjeevi,tollywood,bollywood,fight  చిరు, ప్రభాస్‌లను వారు లెక్కచేయడం లేదుగా!
Bollywood Neglects Tollywood Star Heroes చిరు, ప్రభాస్‌లను వారు లెక్కచేయడం లేదుగా!
Sponsored links

బాహుబలి లాంటి కళా ఖండాన్ని చూసి... ఆ సినిమా కొల్లగొట్టిన భారీ కలెక్షన్స్ ని చూసి కూడా కనీసం టాలీవుడ్ డైరెక్టర్స్ ని కానీ, హీరోలను కానీ అభినందించలేని బాలీవుడ్ హీరోలు... ఇప్పుడు టాలీవుడ్ హీరోలంటే లెక్కలేదంటున్నారు. టాలీవుడ్ హీరోలు మెల్లగా ఇండియా వైడ్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇటు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి కోట్లు కొల్లగొడుతున్నాయి.. దీనికి చిన్న ఉదాహరణ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్. 

ఇక బాహబలితో బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రభాస్.. తన సాహో సినిమాని ఆగష్టు 15 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా భారీ అంచనాలతో ఆగష్టు 15న ఇండియా వైడ్ గా విడుదలకు సిద్ధమవుతుంటే... అక్కడ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ సినిమాని ఆగష్టు 15 కే విడుదలకు డేట్ లాక్ చేసాడు. మరి బాహుబలి ప్రభాస్‌ని చూసి కూడా అక్షయ్ అదరడం లేదు, బెదరడం లేదు.

ఇక తాజాగా మెగా‌స్టార్ చిరంజీవి కూడా తన సైరా నరసింహారెడ్డి సినిమాని అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వరల్డ్ వైడ్ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసినిమాలో మెగాస్టార్ చిరుతో పాటుగా తమిళ, కన్నడ, బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి అమితాబ్ లాంటి నటుడు, తమిళంనుండి నయనతార, విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చా సుదీప్ లాంటి నటులతో తెరకెక్కుతున్న సై రా సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. 

అయితే అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సై రా సినిమాకి ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పోటీ కోస్తున్నాడు. తాజాగా సూపర్ 30 తో భారీ హిట్ అందుకున్న హృతిక్ రోషన్... టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2న విడుదలకు డేట్ లాక్ చేసాడు. చెయ్యడమే కాదు... ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసాడు. మరి బాలీవుడ్ హీరోల తీరు చూస్తుంటే... టాలీవుడ్ హీరోలంటే మాకేం లెక్కలేదు అన్నట్టుగా లేదూ. అందుకే భారీ అంచనాలున్న టాలీవుడ్ సినిమాల మీద తమ సినిమాలు విడుదల చేస్తున్నారు.

Sponsored links

Bollywood Neglects Tollywood Star Heroes :

Tollywood Heroes vs Bollywood Heroes

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019