Advertisement

ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు.. కానీ..: మహేశ్

Tue 16th Jul 2019 07:45 PM
super star mahesh,world cup finals,england,new zealand  ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు.. కానీ..: మహేశ్
Super Star Mahesh still in world cup finals Hangover ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు.. కానీ..: మహేశ్
Advertisement

ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజయం కోసం ఇరు జట్లు ఎంతలా పోరాడాయో.. నరాలు తెగే ఉత్కంఠతో చూసిన క్రీడాభిమానులకే అది అర్థమవుతుంది. ఫైనల్‌గా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలిచేసింది. ఇండియా ఫైనల్‌కు చేరుకోలేదు కాబట్టి పెద్దగా ఈ వరల్డ్‌కప్‌కు పసలేకుండా పోయిందన్నది కొందరి వాదన!.

ఈ అద్భుతమైన మ్యాచ్ ఎంతో మంది క్రీడాభిమానులు, సెలబ్రిటీలు చూసే ఉంటారు. అందరిలోనూ ఒకే టెన్షన్.. టెన్షన్.. వాట్ నెక్ట్స్.. ఎవరు గెలుస్తారు..? ఎవరు గెలుస్తారు..? ఎవర్ని పలకరించినా ఇవే ప్రశ్నలు. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను తాను కూడా ఎంతో ఆసక్తికరంగా చూశానని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు చెబుతున్నారు. ఈ మ్యాచ్ చూశాక తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఇప్పటికీ ఉన్నాను. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చేమో కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా జనాల హృదయాలను గెలుచుకుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మహేశ్ ట్వీట్ చూసిన వీరాభిమానులు, ట్విట్టర్ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Super Star Mahesh still in world cup finals Hangover:

Super Star Mahesh still in world cup finals Hangover

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement