‘సాహో’ ఆ సీన్ కోసం కాంప్రమైజ్ కావడం లేదంట!

Tue 16th Jul 2019 12:45 PM
prabhas,saaho movie,latest,update  ‘సాహో’ ఆ సీన్ కోసం కాంప్రమైజ్ కావడం లేదంట!
Saaho Movie Latest update ‘సాహో’ ఆ సీన్ కోసం కాంప్రమైజ్ కావడం లేదంట!
Sponsored links

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. మొదటినుండి ఈసినిమాకి హైలెట్ దుబాయ్ లో తెరకెక్కించిన ఛేజింగ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని మేకర్స్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి  చేసారు. అటువంటి ఈ సీన్స్ ఎలా ఉండాలి? సినిమాలో ఆ ఎపిసోడ్ ని చూస్తే ఎంత కిక్ రావాలి? ప్రేక్షకులు ఎలా థ్రిల్ అవ్వాలి? సో అందుకే ఆ ఎపిసోడ్ కి ప్రస్తుతం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించే పనిలో ఉన్నారు టీం.

ట్రైలర్ లో కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించిన ఆ సీన్స్ సినిమాలో కొన్ని నిమిషాలు పాటు ఉండనుందట. అందుకే ఈ టోటల్ ఛేజ్ కు సంబంధించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో సాహో యూనిట్ చాలా కేర్ తీసుకుంటోందని తెలుస్తోంది. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆ ఎపిసోడ్ ని తీర్చిదిద్దుతున్నారట.

మిగిలిన విఎఫ్ఎక్స్ పనులు చాలావరకు అయ్యాయి కానీ, ఈ ఛేజింగ్ వర్క్ మాత్రం ఇంకా కాస్త వుందని ఇండస్ట్రీ బోగట్టా. త్వరలోనే ఇది కూడా అయిపోనుందని చెబుతున్నారు. సుజీత్ అండ్ టీం వర్క్ విషయంలో ఎక్కడా హడావిడి లేకుండా చాలా జాగ్రత్తగా, హ్యాండిల్ చేస్తున్నారని టాక్. ఇక ఈసినిమా యొక్క టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Sponsored links

Saaho Movie Latest update:

Producers Not compromised for Saaho

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019