Advertisement

టాలీవుడ్ ప్రముఖుల చేతుల్లో.. ‘నేనున్నాను’!

Sat 13th Jul 2019 09:12 PM
puranapanda srinivas,sai korrapati,rajini,lord hanuman,nenunnanu book,ss rajamouli,balakrishna,jr ntr  టాలీవుడ్ ప్రముఖుల చేతుల్లో.. ‘నేనున్నాను’!
Big Demand For Lord Hanuman Nenunnanu టాలీవుడ్ ప్రముఖుల చేతుల్లో.. ‘నేనున్నాను’!
Advertisement

పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘నేనున్నాను’ మహత్తర గ్రంథాన్ని తెలుగు చలన చిత్రసీమకు చెందిన ప్రముఖులైన నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీర ఎస్. ఎస్. రాజమౌళి అందుకున్నారు. ఈ గ్రంథం విశిష్టతను తెలుసుకున్న వారు.. ఇది తమ చేతుల్లోకి రావడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. ఈ గ్రంథం రచించిన శ్రీనివాస్‌కు, అందించిన వారాహి చలన చిత్రం నిర్మాత కొర్రపాటి సాయికి అభినందనలు తెలిపారు.

అద్భుత దివ్యశక్తుల్ని ఆవిష్కరిస్తున్న ‘నేనున్నాను’

ఈ ప్రపంచంలో హనుమంతుడు లేని ప్రదేశం లేదు. కదిలే ప్రతి కణంలో, సాగే ప్రతిక్షణంలో, ప్రసరించే ప్ర కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణంలో ఆంజనేయ భగవానుని లాలిత్యం వ్యక్తమవుతూనే ఉంటుంది. ఆంజనేయుడంటేనే ఓ గాంభీర్యం, ఓ చలనం, ఓ స్పందనం, ఓ నర్తనం, ఓ ఆవర్తనం, ఓ చైతన్యం, ఓ ధైర్యం. అలాంటి హనుమంతుని ప్రాదుర్భవాన్ని, ప్రాభవాన్ని అద్భుత దివ్యశక్తుల్ని ఆవిష్కరించే గంభీర గ్రంథమే ‘నేనున్నాను’.

ధర్మసాధనకు ఆధారభూతమైన తన వానర శరీరాన్నీ, హృదయాన్నీ శ్రీరామచంద్ర ప్రభువుకే అంకితం చేసిన దివ్యవజ్రదేహ సంపన్నుడు శ్రీ ఆంజనేయస్వామి లీలల లాలనాస్థలిగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపూర్వంగా అందించిన ‘నేనున్నాను’ గ్రంథాన్ని రచించి విడుదల చేసి మూడు సంవత్సరాలైనప్పటికీ - ఇప్పటికే ఆరేడు పునర్ముద్రణలకు నోచుకుని, ఇప్పటికీ పవిత్ర సంచలనం సృష్టిస్తుండడం భక్తి ప్రచురణలలో విశేషంగానే చెప్పాలి.

ముఖ చిత్రం మొదలుకుని చివరి పేజీ వరకు తన్మయభావాన్ని కలిగించే ఈ ‘నేస్తున్నాను’ గ్రంథం సాధకులకు పరమానందాన్ని కలిగించే రామానుగ్రహంగా శోభిల్లుతోందని పండిత ప్రకాండులు ప్రశంసలు వర్షిస్తున్నారు. యంత్రమంత్రాత్మకమైన ఉపాస్య విశేషాలతోనే కాకుండా, అపురూపమైన రామకథతో, హనుమల్లీలతో ఈ భారీ గ్రంథాన్ని పురాణపండ శ్రీనివాస్ కళ్యాణ గుణాలతో తేజరిల్లేలా దర్శింపజేయడంతో ఆబాలగోపాలం ఈ పుస్తకం పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

తిరుమల శ్రీనివాసుని మూల విరాణ్మూర్తికి దశాబ్దాలపాటు నిత్య సేవలందించిన తిరుమల పూర్వప్రధానార్చకులు రమణదీక్షితులు, అప్పుడు శ్రీవారి సాలగ్రామ శిలమూర్తికి నిత్యకైంకర్యాలతో పాటు వైఖానస ఆగమ సంప్రదాయానుసారం అర్చనలు నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఈ ‘నేనున్నాను’ గ్రంథంపై వేనోళ్ళ ప్రశంసలు వర్షించడం బేడీఆంజనేయస్వామి వారి కృషే. చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ ఈ మనోజ్ఞ మంగళమయ గ్రంథాన్ని శ్రీరామచంద్రుని అనుగ్రహంతో, ఆంజనేయస్వామి వారి కృపతో సాధ్యం చేయగలిగారని - ఈ మహత్తర కార్యాన్ని భుజాలపై మోసిన వారాహి చలనచిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ధన్యత పొందారని ఇరువురు ప్రధానార్చకులు వేర్వేరు సందర్భాల్లో అభినందించినప్పటికీ ఇది ముమ్మాటికీ సత్యమే.

ప్రముఖ రచయిత పురాణపండ మహత్తర గ్రంథానికి భారీ డిమాండ్

ఐదువందల అఖండ ఆంజనేయస్వామివార్ల రమణీయ చిత్రాలు పాఠకుణ్ణి ప్రసన్న గంభీర భక్తి స్థితిలోకి తీసుకువెళ్ళడం ఈ ఒక్క మహాగ్రంధంలోనే దర్శనమిస్తుంది. తెలుగునాటే కాదు, యావద్భారతదేశంలోనే మొట్టమొదటి ఆంజనేయ ఉపాస్య గ్రంథం ‘నేనున్నాను’ మాత్రమేనని ఉపాసనాపరులు కూడా గొంతెత్తి చెప్పడాన్ని గమనించాలి. వేదపండితులు, రాజకీయ యోధులు, సినీరంగ ప్రముఖులెందరో ఈ పుస్తకాన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయడమే కాకుండా సాక్షాత్తూ ఆంజనేయుడే మా ఇంటికొచ్చాడని కొందరు సంబరపడడం మరో విశేషం.

ఇంతటి భారీగ్రంథాన్ని పురాణపండ శ్రీనివాస్ ప్రచురించడానికి వాళ్ళ పెద్దతరాల చలువ, అతని సృజనాత్మక ప్రతిభ, నిరంతరం శ్రమించే తత్వం.... అన్నిటికీ మించి ఆంజనేయుని అనుగ్రహమేనని వందల ఆంజనేయ ఆలయాల అర్చకులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూర్, ముంబై, చెన్నై నగరాల్లో సైతం ఈ పుస్తకానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు, ఎంతో ఉందనేది నిర్వివాదాంశం.

ఈ దేశంలో సాక్తేయోపాశనలో అగ్రగణ్యంగా తేజరిల్లుతున్న కుర్తాళం పీఠాంబిక సిద్దేశ్వరీమాత చరణసేవలో నిమగ్నులైన కుర్తాళం పీఠాధిపతి, మహాపండితులు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి వారి అనుగ్రహంతో పాటు శృంగేరి, కంచికామకోటి పీఠాధిపతుల వాత్సల్యాన్ని ఈ గ్రంథ రచయిత పొందడం సరస్వతీ కటాక్షం కాక మరేమిటి?!

Big Demand For Lord Hanuman Nenunnanu:

Puranapanda Srinivas Gives his Nenunnanu Book to Tollywood Top Celebrities

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement