నెక్ట్స్ మహేష్‌తోనే.. క్లారిటీ ఇచ్చేశాడు

Sat 13th Jul 2019 10:56 AM
mahesh babu,sundeep vanga,new movie,clarity  నెక్ట్స్ మహేష్‌తోనే.. క్లారిటీ ఇచ్చేశాడు
Sandeep Vanga Clarity about His Next Film నెక్ట్స్ మహేష్‌తోనే.. క్లారిటీ ఇచ్చేశాడు
Sponsored links

అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన డైరెక్టర్ సందీప్ వంగ, మహేష్ తో సినిమా అని అర్జున్ రెడ్డి తరువాతే ఫిక్స్ అయ్యాడు. మహేష్ కూడా కథ విని చేద్దాం అన్నాడు. కానీ సందీప్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా లేకపోవడంతో ఈసినిమా వాయిదా పడింది. ఈలోపల సందీప్ కు బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం అక్కడికి వెళ్లి అర్జున్ రెడ్డిని రీమేక్ చేయడం జరిగింది.

‘కబీర్ సింగ్’ పేరుతో వచ్చిన ఈసినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్‌ పేరుతో కలెక్షన్స్ మోత మోగిస్తుంది. అయితే మహేష్ సినిమాపై ఈ డైరెక్టర్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. త్వరలో తాను మహేశ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహేశ్‌కి స్టోరీ లైన్ చెప్పానని, ప్రస్తుతం దానిపై వర్క్ స్టార్ట్ చేసానని సందీప్ వంగ చెప్పారు.

అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు సందీప్. ఒకవేళ లేట్ అయితే ఈ గ్యాప్ లో వేరే సినిమా ఏమన్నా చేస్తాడా లేదో చూడాలి.

Sponsored links

Sandeep Vanga Clarity about His Next Film:

Mahesh Babu and Sandeep Vanga Combo Soon

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019