‘బడి దొంగ’ కాన్సెఫ్ట్ బావుందే..!

Sat 13th Jul 2019 01:03 AM
celebrities,speech,badi donga,logo,release event  ‘బడి దొంగ’ కాన్సెఫ్ట్ బావుందే..!
Badi Donga Movie Logo Released ‘బడి దొంగ’ కాన్సెఫ్ట్ బావుందే..!
Sponsored links

బేబి శ్రీనిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ బ్యానర్ పై  మహేష్ సూర్య సిద్దగోని నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘బడిదొంగ’. ఇషిక వర్మ, రవికిరణ్ ఇతర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.. ఈ చిత్రం లోగోను వ్యాపార వేత్త‌లు  రవీందర్ రెడ్డి , చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆవిష్కరించారు.. హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో... 

దర్శకనిర్మాత మహేష్ సూర్య మాట్లాడుతూ..... ‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. ఈటీవీలో ‘నేరాలు–ఘోరాలు’తో సహా పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. ఒకప్పుడు రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు లంకకి వెళ్లొచ్చాడు. రాముడే వెళ్తే ఏమిటనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూడేళ్ల పాటు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నాం. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’ అని చెప్పారు. 

అతిథిగా హాజరైన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ....‘టైటిల్ ఇన్నోవేటివ్ గా ఉంది. సినిమా కూడా అలాగే వస్తుందని, దర్శకుడు మహేష్ సూర్యకి బ్రేక్ ని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 

మరో అతిథి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.... ‘ఈ సినిమా హిట్ కావాలని, నటీనటులకు మంచి పేరు రావాలని కోరుతున్నాను’ అన్నారు. 

హీరోయిన్ ఇషిక వర్మ మాట్లాడుతూ....‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి చిత్రాల్లో నటించాను. హీరోయిన్ గా ఇదే నా తొలిచిత్రం. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. 

నటుడు రవి కిరణ్ మాట్లాడుతూ ....‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ లో నటించాను. ఎస్వీ రంగారావు గారంటే ఇష్టం. ఆయన పోషించిన రావణుడి పాత్రకు దగ్గరగా ఉండే క్యారెక్టర్ లో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. 

సంగీత దర్శకుడు రాజా మాట్లాడుతూ..... ‘చిత్రంలో ఆరు పాటలున్నాయి. ఏదో ఏదో కొత్త వింత అనే ఓ పాటను ఇప్పటికే రికార్డ్ చేశాం. మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకముంది’ అన్నారు. 

త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి సంగీతం: రాజా, పాటలు: వెంకట్ బాలగోని, కెమెరా వంశి, సహనిర్మాతలు: రామ్ వశిష్ట, శ్రీనిత్య, హర్ష వర్థన్, టి.మల్లిఖార్జున్ రావ్, జగదీశ్. 

Sponsored links

Badi Donga Movie Logo Released:

Celebrities Speech at Badi Donga Logo Release Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019