పూర్తి ఫాంటసీ కామెడీ చిత్రంలో అంజలి

Fri 12th Jul 2019 07:23 PM
heroine anjali,next film,update  పూర్తి ఫాంటసీ కామెడీ చిత్రంలో  అంజలి
Anjali in Full Fantacy Comedy Film పూర్తి ఫాంటసీ కామెడీ చిత్రంలో అంజలి
Sponsored links

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్ టైన్ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.  ఇప్పుడు మన అంజలి సరికొత్త సినిమాతో పూర్తి కామెడీ సినిమాతో మన ముందుకు వస్తుంది. కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో బెలూన్ సినిమా దర్శకుడు కె ఎస్ సినీష్ నిర్మాతగా ది సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించబడుతుంది. 

ఈ సందర్బంగా నిర్మాత  కె ఎస్ సినీష్ మాట్లాడుతూ.. ‘‘మాములుగా మహిళలు ప్రధాన పాత్రలో నటించిన  సినిమాలు అయితే థ్రిల్లర్ గా లేక హారర్  సినిమాలుగా నిర్మించబడ్డాయి కానీ మా సినిమా పూర్తి ఫాంటసీ కామెడీ. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ రచించిన ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేద్దాం అని డిసైడ్ అయ్యాను.  అంజలి గారితో నేను బెలూన్ సినిమా దర్శకత్వం చేశాను. తాను అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని తనకు కథను వివరించాము. అంజలి గారు కూడా కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడుతుంది’’. 

దర్శకుడు కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ.. ‘‘అంజలి గారికి ఈ కథ నచ్చుతుందో లేదో అని అనుకున్నాం కానీ తనకి కథ చెప్పగానే చాలా బాగుంది నేను చేస్తున్నాను అని చెప్పగానే మాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. చాలా కొత్త ఉంటుంది’’ అని తెలిపారు. 

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, కథలో రాజకుమారి, పడి పడి లేచె మనసు సినిమాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. రాజా రాణి, అదిరింది, కర్తవ్యం విశ్వాసం లాంటి బారి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎడిటర్ గా పని చేసిన రూబెన్ ఈ సినిమా ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సాహో లాంటి బారి బడ్జెట్ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ సుబ్బరామన్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. శక్తీ వెంకటరాజ్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. కథ దర్శకత్వం కృష్ణన్ జయరాజ్ మరియు నిర్మాత కె ఎస్ సినీష్. 

Sponsored links

Anjali in Full Fantacy Comedy Film:

Anjali Next Film Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019