టెంప్ట్ ర‌విని భయ‌పెడుతున్న ‘వైఫ్‌, ఐ’

Fri 12th Jul 2019 11:34 AM
wife i,wife i movie first look,tempt ravi,yedu chepala katha  టెంప్ట్ ర‌విని భయ‌పెడుతున్న ‘వైఫ్‌, ఐ’
Tempt Ravi acted new Film Wife, I టెంప్ట్ ర‌విని భయ‌పెడుతున్న ‘వైఫ్‌, ఐ’
Sponsored links

ఇటీవ‌ల యూట్యూబ్‌లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ‘ఏడుచేప‌ల క‌థ’లో టెంప్ట్ రవిగా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, ఏడు చేప‌ల క‌థ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మీ చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్‌గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతున్న చిత్రానికి ‘వైఫ్, ఐ’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్‌ని పెట్టారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ని గురువారం విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘గ‌తంలో నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అంతం చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌రువాత మంచి క‌థ కోస‌మే ఇన్ని రోజులు ఆగాల్సి వ‌చ్చింది. ఇప్ప‌డు స‌మాజంలో జ‌రుగుతున్న ఒక మంచి పాయింట్‌ని చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించాము. ఏడు చేప‌ల క‌థ చిత్రంతో చాలా ఫేమ‌స్ అయిన నేచుర‌ల్ ఆర్టిస్ట్ అభిషేక్ రెడ్డి హీరోగా, సాక్షి నిదియా హీరోయిన్‌గా న‌టించారు. ఈ చిత్రంలో భార్య‌, భర్త మధ్య వుండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా ఉంటాయి. పూర్తి రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిస్తున్నాము. ఇప్ప‌టికే దాదాపు 70 పర్సంట్ కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్నాము. ఈ రోజు విడుద‌ల చేసిన  మా ‘వైఫ్,ఐ’ ఫ‌స్ట్‌ లుక్ అండ్ మోషన్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బార్యాభ‌ర్త‌ల మధ్య ప్రెజెంట్ ట్రెండ్ లో వున్న అసూయ ద్వేషాలు, ఎప్ప‌టికో క‌నిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవ‌న్ని మించితే వారి జీవితాలు ఎలా వుంటాయ‌నేది చాలా చ‌క్క‌గా మంచి కంటెంట్ తో తెర‌కెక్కించాము. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని అన్నారు.

నిర్మాత జి. చ‌రితా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ నాకు ఈ క‌థ చెప్పిన‌ప్ప‌డు వెంట‌నే ఓకే చేశాను. ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్‌లో రావాలి. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి. వైవాహిక జీవితాలు నాశ‌నం అయిపోతున్న రోజులు.. భార్యాభర్త మధ్య ప్రేమ‌లు పోయి అసూయ‌లు పెరుగుతున్న రోజులివి. అస‌లు వీటికి కార‌ణం తెలుసుకోలేకపోతున్నారు. ఈ క‌థ‌లో ఈ పాయింట్ నాకు బాగా న‌చ్చింది. మ‌నిష‌న్న ప్ర‌తి ఒక్క‌రూ తప్పులు చేస్తారు.. ఆ త‌ప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి స‌మ‌స్యకైనా ప‌రిష్కారం ఉంటుంది. చాలా చ‌క్క‌గా కళ్యాణ్ తెర‌కెక్కించాడు. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థకి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు. ‘వైఫ్,ఐ’ మొద‌టి లుక్ అంద‌ర్నీ ఆక‌ట్ట‌ుకుంటుంది. మా యూనిట్ అంతా ధీమాగా వున్నారు. అని అన్నారు.

అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా, కావ్య‌, సునీల్ న‌గ‌రం, సూర్య ఆకోండి, మ‌హేష్ విట్ట‌, అప‌ర్ణ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి 

బ్యాన‌ర్: ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్

నిర్మాత: జి చ‌రితా రెడ్డి

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, కెమెరా, ద‌ర్శ‌క‌త్వం: జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్‌

మ్యూజిక్‌: వినోద్ యాజ‌మాన్య‌

లిరిక్స్: రాంబాబు గోసాల‌

 

Sponsored links

Tempt Ravi acted new Film Wife, I:

Wife, I Movie First Look Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019