‘మిస్ మ్యాచ్’ టీజర్ వెంకీకి నచ్చింది

Thu 11th Jul 2019 09:10 PM
victory venkatesh,miss match movie,teaser launch,uday shankar,aishwarya rajesh  ‘మిస్ మ్యాచ్’ టీజర్ వెంకీకి నచ్చింది
Miss Match Movie Teaser Released ‘మిస్ మ్యాచ్’ టీజర్ వెంకీకి నచ్చింది
Sponsored links

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి చిత్రంగా ‘మిస్ మ్యాచ్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించన ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. 

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్. మిస్ మ్యాచ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజాగారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్టాఫ్ లక్ తెలుపుతున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ.. ‘‘విక్టరీ వెంకటేష్‌గారు మా చిత్ర టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను..’’ అన్నారు. 

నా మొదటి సినిమా ‘ఆటకథరాశివ’కు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజాగారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము’’అన్నారు.

రచయిత భూపతిరాజా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్‌లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్‌కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతిరాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్, నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్.

Sponsored links

Miss Match Movie Teaser Released:

Victory Venkatesh Launches Miss Match Movie Teaser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019