షాకింగ్: శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారట!

Thu 11th Jul 2019 03:22 PM
actress sridevi,death,dgp,sridevi death  షాకింగ్: శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారట!
Actress Sridevi’s death: Jail DGP makes surprising claim షాకింగ్: శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారట!
Sponsored links

అవును మీరు వింటున్నది నిజమే.. అతిలోక సుందరి.. అందం అంటే టక్కున గుర్తొచ్చే శ్రీదేవి ది సహజమరణం కాదట. ఆమెను పక్కా ప్లాన్‌తో చంపేశారట. ఈ షాకింగ్ విషయాన్ని కేరళకు చెందిన డీజీపీ రిషిరాజ్ సింగ్ వెల్లడించారు. డీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలను ఓ ప్రముఖ పత్రిక ప్రచురించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అతిలోక సుందరి శ్రీదేవి గ‌తేడాది ఫిబ్రవ‌రి 24న దుబాయ్‌లో హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఆమె ప్రమాదవ శాత్తు పడి చనిపోయిందని రిపోర్టుల్లో తేలింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరో ఎన్నెన్నో షాకింగ్ న్యూస్‌ల మధ్య ఆమె అంత్యక్రియలు అయిపోయాయ్.. ఆ ఎపిసోడ్ ఇక ముగిసిపోయింది. అయితే తాజాగా.. కేరళకు చెందిన డీజీపీ.. శ్రీదేవి మరణంపై ఉన్నట్లుండి బాంబ్ పేల్చారు.

శ్రీదేవి అందరూ అనుకున్నట్లుగా సహజంగా మరణించలేదని.. ఆమెను హత్య చేసి చంపేశారన్నారు. తనకు ఈ సీక్రెట్ విషయాన్ని ఫొరెన్సిక్ ల్యాబ్‌లో పనిచేసే మిత్రుడు సర్జన్ డాక్టర్ ఉమాదతాన్ చెప్పారన్నారు. అంతేకాదు.. ఆమెను హత్య చేసి చంపేశారన్నదానికి పక్కా ఆధారాలు సైతం తనకు మిత్రుడు చూపించాడని రిషిరాజ్ చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తాగితే ఒక అడుగు మాత్రమే ఉన్న టబ్‌లో చనిపోరని.. ఎవరో ఆమెను తోసి నీటిలో ముంచి ఉంటారని డీజీపీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మరణంపై శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Actress Sridevi’s death: Jail DGP makes surprising claim:

 Actress Sridevi’s death: Jail DGP makes surprising claim

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019