ఆ రెండు సినిమాలు కలిపితే ‘సరిలేరు నీకెవ్వరు’!?

Thu 11th Jul 2019 01:47 PM
superstar mahesh babu,major ajay krishna,sarileru neekevvaru,anil raavipudi  ఆ రెండు సినిమాలు కలిపితే ‘సరిలేరు నీకెవ్వరు’!?
Superstar mahesh babu turns into Major Ajay Krishna ఆ రెండు సినిమాలు కలిపితే ‘సరిలేరు నీకెవ్వరు’!?
Sponsored links

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే కశ్మీర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ 26వ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సూపర్బ్ అనిపించింది. తాజాగా మహేశ్‌ రెండో లుక్‌ను అధికారికంగానే డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా యూనిట్ విడుదల చేసింది.

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ పాత్ర, పేరును రివీల్ చేయడం జరిగింది. కాగా ‘ఆర్మీ మేజర్’గా నటిస్తున్న మహేశ్ పేరు ఈ మూవీలో ‘అజయ్ కృష్ణ’. ఆర్మీ డ్రస్‌పై ఉన్న నేమ్ ప్లేట్ ఫోటోను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఈ సినిమాను తెలుగువారి సంక్రాంతికి మీ ముందుకు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు.

కాగా.. మహేశ్ లుక్‌ను, పాత్రను బట్టి చూస్తుంటే అందరికీ పోకిరి+దూకుడు సినిమాలే గుర్తొస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేరు సైతం ఆ రెండు సినిమాల నుంచి తీసుకోవడం గమనార్హం. ‘పోకిరి’లో కృష్ణ మనోహర్’ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు.. ‘దూకుడు’లో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించిన విషయం విదితమే. దీంతో తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’లో పోకిరిలోని కృష్ణ.. దూకుడులోని అజయ్ కలిపి మేజర్ ‘అజయ్ కృష్ణ’గా సెట్ చేశారన్న మాట. సినిమా సరిగ్గా సెట్స్ మీదికి వెళ్లక ముందే పుకార్లు మొదలయ్యాయి.. మరి మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

Sponsored links

Superstar mahesh babu turns into Major Ajay Krishna:

Superstar mahesh babu turns into Major Ajay Krishna

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019