‘రాక్ష‌సుడు’ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు

Wed 10th Jul 2019 09:43 PM
rakshasudu,bellamkonda sai srinivas,ramesh varma,rakshasudu movie  ‘రాక్ష‌సుడు’ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు
Rakshasudu in Post Production Stage ‘రాక్ష‌సుడు’ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు
Sponsored links

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ‘రాక్ష‌సుడు’.. ఆగ‌స్ట్ 2న గ్రాండ్ రిలీజ్‌

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘రాక్షసుడు’. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత హ‌వీష్ కొనేరు మాట్లాడుతూ.. ‘‘త‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అయిన రాక్ష‌స‌న్ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ఈ చిత్రాన్ని ర‌మేష్‌వ‌ర్మ‌గారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాలేదు. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్‌గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.

Sponsored links

Rakshasudu in Post Production Stage:

Rakshasudu Movie Release on Aug 02

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019