చిరు ‘సైరా’ కోసం రాజమౌళి!

Wed 10th Jul 2019 12:57 PM
rajamouli,director,suggestions,chiranjeevi,sye raa  చిరు ‘సైరా’ కోసం రాజమౌళి!
Chiranjeevi wants Rajamouli for Sye Raa చిరు ‘సైరా’ కోసం రాజమౌళి!
Sponsored links

చిరంజీవి - సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న సై రా సినిమా షూటింగ్ దిగ్విజయంగా మొన్నీమధ్యనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సై రా టీం బిజీగా వుంది. ఇండియా వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి సినిమా విషయంలో మెగాస్టార్ చిరు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎలాగూ నిర్మాత రామ్ చరణ్ RRR సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు కాబట్టి... చిరు ఇప్పుడు సై రా విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక సై రా సినిమా రష్ ని తాను చూడడమే కాదు.... టాలీవుడ్ లోని తనకు మిత్రులైన పలువురు ప్రముఖ డైరెక్టర్స్ కి చిరు చూపించబోతున్నాడట. ఎందుకంటే వారు చూసి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెబితే.. వాటిని ఇప్పుడే రిపేర్లు చేసుకోవచ్చని చిరు ప్లాన్. 

ఇప్పటికే చిరంజీవి తనకు అత్యంత ఆప్తుడైన సత్యానంద్ ని పిలిచి సై రా రషెస్ చూపించినట్లుగా  సమాచారం. ఇక త్వరలోనే రాఘవేంద్ర రావు కూడా సైరా రషెస్ చూడడానికి రాబోతున్నాడట. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ తో టాలీవుడ్ లోనే కాదు... ఇండియా వైడ్ గా ఓ కొత్త ఒరవడి సృష్టించిన రాజమౌళిని పిలిచి సై రా నరసింహారెడ్డిని చూపించి.... సై రా కోసం రాజమౌళి ఇచ్చే సలహాలను కూడా పాటించాలని చిరు అనుకుంటున్నాడట. సై రా సినిమాలో కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే వాటిని రాజమౌళికి చూపించి సలహాలు సూచనలు తీసుకోవాలని చిరు అనుకుంటున్నాడట. మరి చిరు కోసం రాజమౌళి వచ్చి ఏ మాత్రం సలహాలు సై రా కోసం ఇవ్వబోతున్నాడో అనే క్యూరియాసిటీతో మెగా అభిమానులు ఉన్నారు.

Sponsored links

Chiranjeevi wants Rajamouli for Sye Raa:

Rajamouli Suggestions for Chiru Sye Raa

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019