Advertisementt

ఇక సినిమాలు, షోలు వద్దు ‘నిర్మించేస్తా’నంటున్న యాంకర్!

Mon 08th Jul 2019 02:22 PM
telugu top anchor,productions,tollywood,anchor anasuya  ఇక సినిమాలు, షోలు వద్దు ‘నిర్మించేస్తా’నంటున్న యాంకర్!
Telugu top anchor ready to produce movies ఇక సినిమాలు, షోలు వద్దు ‘నిర్మించేస్తా’నంటున్న యాంకర్!
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ అటు సినిమాలతో, ఇటు టీవీ షోలతో ఇలా బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే ఇక ముందు సినిమాలు, షోలు చేయకూడదని డిసైడ్ అయిపోయిందట. ఇందుకు కారణం మరేదో కాదండోయ్.. రెండు చేతులతో సంపాదించిన డబ్బులు ఏం చేయాలో దిక్కుతోచట్లేదట. అందుకే ఇక సినిమాలు, టీవీ షో‌లకు టాటా చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట.

వాస్తవానికి టాలీవుడ్ యాంకర్లలో ఈ హాట్ భామ రెమ్యునరేషన్ గట్టిగానే ఉంది. అంతేకాదు ఇక గ్యాప్ లేకుండా చేస్తున్న సినిమాల్లో సైతం కోట్లల్లోనే ఉంది. ఇక సంపాదించిన డబ్బులంతా నిర్మాణ రంగంలో పెట్టాలని అనసూయ నిర్ణయించిందట. ఈ విషయాన్ని ‘తానా’ వేదికగా అనసూయ పరోక్షంగా ప్రకటించింది. అమెరికాలో తెలుగువారి పండుగ ‘తానా’ సభల్లో పాల్గొన్న అనసూయ తన అత్యంత సన్నిహితు వద్ద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు చెప్పారట.

అనసూయ చెప్పిన ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి మీడియా మిత్రుల చెవున పడింది. ఇంకేముంది వార్తలే.. వార్తలు. అంతేకాదు..  త్వరలో ‘అనసూయ పిక్చర్స్’ బ్యానర్‌ని ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ చేసే ఆలోచన కూడా అనసూయకు ఉందట. కాగా.. యాంకర్‌, నటిగా ప్రూవ్ చేసుకుంది.. ఇది అందరికీ తెలిసన విషయమే. అయితే ఇక నిర్మాతగానూ సక్సెస్ కావడంలో సందేహాలు అవసరం లేదని చెప్పడంలో ఎలాంటి అతియోక్తి లేదని క్రిటిక్స్ చెబుతున్నారు.

Telugu top anchor ready to produce movies:

Telugu top anchor ready to produce movies

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ