కబీర్ సింగ్ అస్సలు తగ్గడం లేదుగా!

Fri 28th Jun 2019 01:57 PM
kabir singh,collections,100 crore club,box office  కబీర్ సింగ్ అస్సలు తగ్గడం లేదుగా!
Kabir Singh Collections Creates Sensation at Box Office కబీర్ సింగ్ అస్సలు తగ్గడం లేదుగా!
Sponsored links

తెలుగు అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యి బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. గత శుక్రవారం విడుదలైన కబీర్ సింగ్ కి అక్కడి క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్స్ ఇచ్చినప్పటికీ.. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పట్టారు. షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ కబీర్ సింగ్ నిలిచిపోయేలా కనబడుతుంది కబీర్ సింగ్ కలెక్షన్స్ చూస్తుంటే. కబీర్ సింగ్ కథ, కథనం, షాహిద్ కపూర్ స్టయిల్ అండ్ యాక్టింగ్, సందీప్ వంగ డైరెక్షన్ స్కిల్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఒక తెలుగు దర్శకుడు అలా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టడం చూసిన చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కుళ్ళుకుంటున్నారు. మొన్నటివరకు రాజమౌళి బాహుబలి మీద పడి ఏడ్చిన జనాలు ఇప్పుడు కబీర్ సింగ్ మీద పడి ఏడుస్తున్నారు. కబీర్ సింగ్ ఫస్ట్ వీకెండ్ లోనే 70 కోట్లకు పైగా కొల్లగొట్టి.. తన స్టామినాని తెలియజెప్పింది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో కనబడితే... తర్వాత వీక్ డేస్ లో కబీర్ సింగ్ వీక్ అవుతుంది అనుకుంటే.. కలెక్షన్స్ మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. అలా కబీర్ సింగ్ బాలీవుడ్ లో పంబ రేపే కలెక్షన్స్ తో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా దూసుకుపోతుంది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలల్లో కబీర్ సింగ్ నిలవడం ఖాయంగానే కనబడుతుంది. ఇక ఫస్ట్ వీకెండ్ మాట అలా ఉంచితే సోమవారం 17 కోట్లకు పైగా, మంగళవారం 16 కోట్లు, బుధవారం కూడా 15 కోట్లకు పైగా కబీర్ సింగ్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. మరి వీక్ డేస్ లో సత్తా చాటుతున్న కబీర్ సింగ్ మీద బాలీవుడ్ లో కాంట్రవర్సీలు మొదలైయ్యాయి. ఏ కాంట్రవర్సీ అయినా.. కబీర్ సింగ్ కి ఫేవర్ చేస్తుంది కానీ.. కలెక్షన్స్ అయితే తగ్గే సమస్యే లేదు అన్నట్టుగా వుంది కబీర్ సింగ్ వ్యవహారం.

Sponsored links

Kabir Singh Collections Creates Sensation at Box Office:

Kabir Singh in 100 Crore Club

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019