పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `నా పేరు రాజా`

Thu 27th Jun 2019 02:57 PM
naa peru raja movie,latest,update  పోస్ట్  ప్రొడక్షన్ కార్యక్రమాల్లో  `నా పేరు రాజా`
Naa Peru Raja in Post Production Stage పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `నా పేరు రాజా`
Sponsored links

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్  హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు రాజా’.  (ఈడో రకం -డెఫెనెట్లీ డిఫ‌రెంట్ ట్యాగ్ లైన్ ) రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్, డిఐ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. యాక్ష‌న్ అండ్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోన్న

ఈ చిత్రం గురించి ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ... ‘‘తిరుగుబోతు, ద్వార‌క చిత్రాల‌తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ష‌న్ స్టార్ రాజ్ సూరియ‌న్ ఈసారి మూడు డైన‌మిక్ అండ్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో న‌టిస్తోన్న చిత్రం ‘నా పేరు రాజా’.  ఏపి, తెలంగాణ‌, కేర‌ళ మరియు క‌ర్ణాట‌క ప్రాంతాల్లో దాదాపు 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించిన చిత్రానికి సంగీతం అందించిన ఎల్విన్ జాషువా ఈ చిత్రానికి అద్భ‌తుమైన సంగీతం స‌మ‌కూర్చారు. ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగుతూ డిఫ‌రెంట్ సౌండింగ్ తో  ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ఎల్విన్ జాషువా అద్భుత‌మైన బాణీల‌కు సాహితి, శ్రీమ‌ణి గార్లు అర్థ‌వంత‌మైన సాహిత్యాన్ని స‌మకూర్చారు. ఈ పాట‌ల‌ను సంచిత్ హెగ్డే, మోహ‌న్ భోగ‌రాజు, లిప్పిక‌, అభినంద‌న్, చేత‌న్ నాయ‌క్ ఆల‌పించ‌గా న‌గేష్‌.వి ఎక్స్ లెంట్ కొరియోగ్ర‌ఫీ అందించారు.

సిజి, విఎఫ్ఎక్స్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా  ఖ‌ర్చు పెట్టాం. థియేట‌ర్స్ లో ఆడియ‌న్స్ క‌చ్చితంగా థ్రిల్ ఫీల‌య్యేలా ప్ర‌తి స‌న్నివేశం ఉంటుంది. థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మ‌ద కంపోజ్ చేసిన ట‌ఫ్  ఫైట్స్ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే రామ్ గోపాల్ వ‌ర్మ‌లాంటి గొప్ప ద‌ర్శ‌కుల సినిమాల‌కు ప‌ని చేసిన వెంకట్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.  ఇలా ఎంతో టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్, ఆర్టిస్ట్స్  మా చిత్రానికి ప‌ని చేసారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్, డిఐ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో పాట‌లు, సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్, సూప‌ర్ మోడ‌ల్ అవా స‌ఫాయి, ఆరాధ్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి.. సంగీతం: ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్: ఎ.వెంక‌ట్, ఎడిట‌ర్: వెంకీ యుడివి,  ఫైట్స్:  థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌,  కొరియోగ్రాఫ‌ర్: న‌గేష్‌.వి,  లిరిక్స్: శ్రీమ‌ణి, సాహితి, నిర్మాత‌లు: రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి, ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వం: అశ్విన్ కృష్ణ‌.

Sponsored links

Naa Peru Raja in Post Production Stage:

Naa Peru Raja Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019