ఆగ్రహంకు వర్మ సపోర్ట్

Wed 26th Jun 2019 10:19 AM
ram gopal varma,aagraham,teaser,release,mumbai  ఆగ్రహంకు వర్మ సపోర్ట్
Rgv Releases Aagraham Teaser at Mumbai ఆగ్రహంకు వర్మ సపోర్ట్
Sponsored links

ముంబైలో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన ‘ఆగ్రహం’ టీజర్                              

ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా  ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఆగ్రహం’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను రాంగోపాల్ వర్మ ముంబై లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్ , నిర్మాత చెరుకూరి సందీప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్  కధాంశమిది. ఈ చిత్రంలో 5  ఫైట్స్ ఉంటాయి. ‘ఆఫీసర్, సర్కార్3 చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని అన్నారు. 

చిత్ర నిర్మాత  సందీప్ మాట్లాడుతూ.. ‘‘కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెరకెక్కించాం. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.’’ అన్నారు. 

ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ, ఎడిటర్: జె. పి, ఆర్ ఆర్ : రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడారి మూర్తి, నిర్మాత: చెరుకూరి సందీప్, దర్శకత్వం: ఆర్. ఎస్. సురేష్

Sponsored links

Rgv Releases Aagraham Teaser at Mumbai:

Aagraham Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019