చిరు, చెర్రీ ఇద్దరూ రొమాంటిక్ హీరోలే : హీరోయిన్

Bollywood Top Heroine About Chiranjeevi, Ram Charan and Nagarjuna

Tue 25th Jun 2019 01:47 PM
Advertisement
mahima chaudhary,bollywood,heroine,latest,interview  చిరు, చెర్రీ ఇద్దరూ రొమాంటిక్ హీరోలే : హీరోయిన్
Bollywood Top Heroine About Chiranjeevi, Ram Charan and Nagarjuna చిరు, చెర్రీ ఇద్దరూ రొమాంటిక్ హీరోలే : హీరోయిన్
Advertisement

బాలీవుడ్ నటి మహిమా చౌదరి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇటీవల హైదరాబాద్‌కు ఈ భామ విచ్చేయగా.. ఈమె ఇంటర్వ్యూ కోసం మీడియా మిత్రులు క్యూ కట్టారు. తాజాగా.. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అందాల భామ టాలీవుడ్ గురించి.. మెగాస్టార్ చిరంజీవీ, అక్కినేని నాగార్జున గురించి మాట్లాడింది.

మెగాస్టార్ చిరు.. ఆయన కుమారుడు ఇద్దరూ చాలా రొమాంటిక్ హీరోలేనని మహిమా చెప్పుకొచ్చింది. చిరు కళ్లు సూపర్బ్ అని.. చాలా బాగుంటాయని చెప్పింది. టాలీవుడ్ మన్మథుడు గురించి మాట్లాడిన ఆమె.. నాగ్‌తో ఓ సినిమా అవకాశం వచ్చిందని అప్పట్లో తాను బాలీవుడ్‌లో బిజిబిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయానని చెప్పింది. అయితే ఇప్పట్లో అవకాశమొస్తే కచ్చితంగా నాగ్‌తో నటిస్తానని తెలిపింది.

ఈ సందర్భంగా.. తాను టాలీవుడ్‌లో నటించిన సినిమాలను గుర్తుకు తెచ్చుకుంది. శ్రీకాంత్, జగపతి బాబు సినిమాల్లో చేశానని.. అప్పట్లో తెలుగు రాక చాలా కష్టపడ్డానని తీపి గుర్తులు నెమరు వేసుకుంది. తనకు హైదరాబాద్‌ నగరంతో మంచి అనుబంధం ఉందని..  ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలలో ఎన్నో సినిమాలు చేశానని మహిమా చౌదరి చెప్పుకొచ్చింది. మహిమ వ్యాఖ్యలపై చిరు, నాగ్, చెర్రీ రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సిందే మరి.

Advertisement

Bollywood Top Heroine About Chiranjeevi, Ram Charan and Nagarjuna:

Mahima Chaudhary Latest Interview

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement