‘మా’ బద్ధ శత్రువులిద్దరూ ఒక్కట్టయ్యారోచ్!

Mon 24th Jun 2019 04:43 PM
shivaji raja,naresh,maa meeting,friends,maa president  ‘మా’ బద్ధ శత్రువులిద్దరూ ఒక్కట్టయ్యారోచ్!
Shivaji Raja and Naresh at MAA Meeting ‘మా’ బద్ధ శత్రువులిద్దరూ ఒక్కట్టయ్యారోచ్!
Sponsored links

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టాలీవుడ్‌లో మినీ ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా జరిగాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి రెండోసారి శివాజీ రాజా పోటీ చేయగా.. మరోవైపు నరేష్ ఇద్దరూ పోటాపోటీగా ప్రెస్‌మీట్లు, ప్రచారాలు, ఒకరి బాగోతాలు ఒకరు బయటపెట్టుకోవడం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల సీజన్ మొదలుకుని.. నరేష్ ప్యానెల్ గెలిచి బాధ్యతలు చేపట్టే వరకు ప్రతిదీ వివాదాస్పదమే అయ్యింది.

ఆ తర్వాత కూడా ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుని మీడియాలో చర్చనీయాంశమయ్యారు. అయితే వారిద్దరూ ఇంతకు ముందు వరకూ శత్రువులేం కాదు.. ‘మా’ ఎన్నికలే వీరిద్దరినీ బద్ధశత్రువులుగా మార్చేశాయ్. అలా ఉప్పు-నిప్పులా ఉన్న శివాజీ రాజా-నరేష్ మళ్లీ ఒక్కటయ్యారు. ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇద్దరూ నవ్వుతూ కనపడ్డారు. 

దీంతో హమ్మాయ్యా.. శత్రువులిద్దరూ కలిసిపోయారోచ్.. అంటూ తోటి ఆర్టిస్ట్‌‌లు చెప్పుకుంటున్నారు. కాగా ఈ సమావేశంలో ‘మా’ సభ్యుల కోసం ఇప్పటి వరకూ ఏం చేశాం... భవిష్యత్తులో ఏమేం చేస్తామన్నది ‘మా’ అధ్యక్షుడు నరేష్ నిశితంగా వివరించారు. అయితే ఇదే సమావేశంలో ‘మా’ ముఖ్య సలహాదారునిగా కృష్ణంరాజు నియమించుకుని.. రెబల్ స్టార్ దంపతులకు ఈ సందర్భంగా పూలమాలతో సత్కరించడం జరిగింది.

Sponsored links

Shivaji Raja and Naresh at MAA Meeting:

No fight between Shivaji Raja and Naresh

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019