మహేష్‌తో నాకేం రిలేషన్ లేదు: విజయశాంతి

Mon 24th Jun 2019 10:15 AM
vijayashanti,sarileru neekevvaru,mahesh babu,releation,actress  మహేష్‌తో నాకేం రిలేషన్ లేదు: విజయశాంతి
Vijayashanti talks about Sarileru Neekevvaru Movie Role మహేష్‌తో నాకేం రిలేషన్ లేదు: విజయశాంతి
Sponsored links

మహేష్ బాబు మహర్షి సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మహేష్ మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక చాలా కాలం తర్వాత మాజీ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం విజయశాంతి ఎప్పుడో చెప్పింది. అయితే ఈ సినిమాలో విజయశాంతి మహేష్ తల్లిగా నటిస్తుందని ఒకసారి, కాదు నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనబడబోతోందని మరోసారి ప్రచారం జరిగింది.

తాజాగా విజయశాంతి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తాను ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతుందో రివీల్ చేసింది. అయితే తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాననే విషయం నిజం కాదని.. ఈ సినిమాలో తనది ఓ ముఖ్యమైన కీలకపాత్ర మాత్రమే కానీ.... విలన్ రోల్ కాదని తెలిపింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయనని చెప్పిన ఆమె.. మహేష్ కి తనకి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా ఉండదు అని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తన పాత్రపై విజయశాంతి క్లారిటీ ఇవ్వడంతో.. ఆమె పాత్రపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Sponsored links

Vijayashanti talks about Sarileru Neekevvaru Movie Role:

No Relation with Mahesh In Sarileru Neekevvaru say Vijayashanti

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019