‘సైరా’.. చిరు చేతుల్లోకి..!!

Sun 23rd Jun 2019 07:44 PM
ram charan,sye raa,chiranjeevi,rrr movie,chiru  ‘సైరా’.. చిరు చేతుల్లోకి..!!
Sye Raa Narasimha Reddy in Chiranjeevi Hands ‘సైరా’.. చిరు చేతుల్లోకి..!!
Sponsored links

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ 2 న ఈమూవీ రిలీజ్ అవ్వబోతుంది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలానే ఉన్నాయి. ప్రమోషన్స్ దగ్గర నుండి అన్ని తానె చూసుకునే రామ్ చరణ్ ప్రస్తుతం అందుబాటులో ఉండడు. RRR షూటింగ్ కోసం వేరే రాష్ట్రము వెళ్లనున్నారు. సుమారు నెలన్నరకు పైగా అందుబాటులో వచ్చే పరిస్థితి లేదు.

ఆల్రెడీ RRR షూటింగ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ వల్ల వాయిదా పడడంతో మరోసారి ఆ తప్పు జరగకూడదని రాజమౌళి పక్క ప్లాన్ తో నెక్స్ట్ షెడ్యూల్ కి వెళ్తున్నాడు. సో RRR వ్యవహారంలో పడిపోతే సైరా మీద ఫోకస్ పెట్టలేడు కాబట్టి ఆ భాద్యతలు అన్ని నాన్న చిరంజీవికే చరణ్ అప్పజెప్పినట్టు సమాచారం. అప్పుడప్పుడు బాబాయ్ నాగబాబు ని కూడా చూసుకోవాలని చరణ్ కోరాడట. సైరా బిజినెస్ కి సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఒకవేళ ఏమన్నా బ్యాలన్స్ ఉన్నా.. చిరు పుట్టిరోజున చరణ్ ఎలాగో వస్తాడు కాబట్టి అప్పుడు వాటిని ఫైనల్ చేస్తారు. రిలీజ్ కి నెల రోజులు ముందు నుండే ప్రమోషన్స్ చేయాలి కాబట్టి చరణ్ అప్పటికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.

Sponsored links

Sye Raa Narasimha Reddy in Chiranjeevi Hands:

Ram Charan Busy with RRR Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019