కృష్ణారావు సూపర్ మార్కెట్ పై వెంకీ ప్రశంసలు

Sun 23rd Jun 2019 04:30 PM
venkatesh,krishnarao super market,teaser,praises  కృష్ణారావు సూపర్ మార్కెట్ పై వెంకీ ప్రశంసలు
Venki Praises krishnarao Super Market Teaser కృష్ణారావు సూపర్ మార్కెట్ పై వెంకీ ప్రశంసలు
Sponsored links

విక్టరీ వెంకటేష్ ప్రశంసలందుకున్న కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్  టీజ‌ర్ 

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం  కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్.  శ్రీ‌నాధ్ పుల‌క‌రం ద‌ర్శ‌కుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ చూసి చిత్ర యూనిట్ కు విషెష్ ను తెలియ చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.‌. ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’  టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. రియలిస్టిక్ గా ఉంది‌.‌ ఈ తరహా చిత్రాలనే నేటి యూత్ ఎంకరేజ్ చేస్తున్నారు.‌ హీరో కృష్ణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాలి, టీమ్ కు ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. వెంకటేష్  గారి ఎంకరేజ్మెంట్ కు ధన్యవాదాలు.‌ వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరమీదకు తీసుకువచ్చాము. చూసిన వారందరికి సినిమాలోని వాస్తవికత నచ్చుతోంది‌. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు థ్రిల్ చేసే విషయాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు.

గౌత‌మ్‌రాజు మాట్లాడుతూ... 

టీజర్ నచ్చి వెంకటేష్ బాబు మా టీమ్ కు విషెష్ అందించటం ఆనందంగా ఉంది. అన్నీ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే  సినిమాను విడుదల చేస్తామన్నారు.

హీరో కృష్ణ  మాట్లాడుతూ... సామాన్య ప్రేక్షకులతో పాటు వెంకటేష్ గారి లాంటి బిగ్ సెలబ్రిటీలను కూడా మా చిత్ర టీజర్ ఆకట్టుకుంది.‌ ఇప్పటికే సినిమాను కూడా కొంతమందికి చూపించటం జరిగింది. ‌అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లభించటం సినిమా సక్సెస్ పై మాకు మరింత కాన్పిడెన్స్ ను పెంచిందన్నారు.

కృష్ణ‌, ఎల్సాగోష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, గౌతంరాజ్‌, బెన‌ర్జీ, ర‌విప్ర‌కాష్‌, సూర్య‌, స‌న‌, దొర‌బాబు, సంజు, స‌హ‌స్ర‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: బోలే ష‌వాలీ, కెమెరామెన్: ఎ. విజ‌య్‌కుమార్‌, ఎడిట‌ర్: మార్తాండ్‌, కె.వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు: శ్రీ‌నాద్‌పుల‌క‌రం, నిర్మాత: బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్‌.

Sponsored links

Venki Praises krishnarao Super Market Teaser:

Venkatesh about Krishnarao Super Market Teaser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019