‘ఓకే డార్లింగ్ నేను రెడీ’.. దిల్‌రాజుతో ప్రభాస్!

Thu 20th Jun 2019 05:45 PM
prabhas,saaho,john,dil raju,svc,prabhas and dil raju  ‘ఓకే డార్లింగ్ నేను రెడీ’.. దిల్‌రాజుతో ప్రభాస్!
Prabhas Green Signal to Movie with Dil Raju ‘ఓకే డార్లింగ్ నేను రెడీ’.. దిల్‌రాజుతో ప్రభాస్!
Sponsored links

‘బాహుబలి’ సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రం ‘సాహో’. ఆగస్ట్-15న ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదే రోజున భారీ చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ.. ‘సాహో’పైనే అందరి కళ్లు పడ్డాయ్.

‘సాహో’ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ ఓ చిత్రం చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. రెండ్రోజుల క్రితమే.. దిల్‌రాజు కథ వినిపించాడట. అయితే మొత్తం విన్నాక సూపర్బ్ అన్న ప్రభాస్.. ‘ఓకే డార్లింగ్ నేను రెడీ’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడి కోసమే అటు దిల్‌రాజు.. ఇటు ప్రభాస్ వెతుకుతున్నారట. 

ఇది ఒకరకంగా దిల్‌రాజుకు శుభవార్తేనని చెప్పుకోవచ్చు. కాగా.. గతంలో ప్రభాస్‌కు ‘మున్నా’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి హిట్ చిత్రాలను దిల్‌రాజు అందించిన సంగతి తెలిసిందే. తాజా చిత్రంతో ప్రభాస్‌కు దిల్‌రాజు హ్యాట్రిక్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి. 

Sponsored links

Prabhas Green Signal to Movie with Dil Raju :

Prabhas and Dil Raju Combo Soon

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019