ఆ వయసు.. ప్రేమించడానికి పనికి రాదా?

Wed 19th Jun 2019 08:54 PM
prema janta,pre release function,ram praneeth,sumaya,prema janta movie  ఆ వయసు..  ప్రేమించడానికి పనికి రాదా?
Prema Janta Movie Pre Release Function ఆ వయసు.. ప్రేమించడానికి పనికి రాదా?
Sponsored links

‘ప్రేమ‌జంట‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘ప్రేమ‌జంట‌’. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యుఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. మంగ‌ళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా డైరెక్ట‌ర్ సాగ‌ర్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్ పాల్గొన్నారు. డైరెక్ట‌ర్ సాగ‌ర్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ.. ‘‘ట్రైల‌ర్‌, పాట‌ల్లో చూపించినట్టుగా ఈ చిత్రంలోని ప్రేమ జంట సూసైడ్ వరకు వెళ్లారంటే ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతోంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి. అమ్మాయి అబ్బాయి కూడా బాగా నటించారు. అందంగా ఉన్నారు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమాను ప్రతిఒక్కరూ నిర్మిస్తారు కానీ విడుదల వరకు తీసుకురావడం అంత తెలికేమీ కాదు. కానీ ఈ చిత్ర నిర్మాత మహేష్ గారు ఆ కష్టాన్ని అధిగమించినట్టు కనిపిస్తున్నారు. ఆయన పెట్టిన డబ్బు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా కనపడుతుంది. ఇటీవల వచ్చిన యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న మూవీస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఈ ‘ప్రేమ జంట’ కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుండడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ గురుంచి తెలియగానే వెంటనే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాము. నిఖిలేష్ మహేశ్ ఇద్దరూ స్నేహితులు అవడంతో ఈ సినిమాను ఎంకరేజ్ చేశాను. మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నాం ఆదరించండి’’ అన్నారు. 

నిర్మాత మహేష్ మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న నేను సినీ ఫీల్డ్ లోనికి రావడం జరిగింది. కంటెంట్ చాలా బాగుంది. గ్రేస్ ఫుల్ అబ్బాయి, బ్యూటిఫుల్ అమ్మాయిల ప్రేమే ఈ చిత్రం. అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు నిఖిలేష్. మిమ్మల్ని తప్పకుండా అలరించే చిత్రం అవుతుంది’’ అన్నారు. 

దర్శకుడు నిఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘పదమూడేళ్ల క్రితం ఓ కల కన్నాను. ఆ కల ఇప్పుడు ఇలా నిర్మాత మహేష్ వలన ఈ రోజు నిజమైంది. మహేష్ నా స్నేహితుడు మా జర్నీలో సినిమాపై ఇంట్రెస్టింగ్ తో అడుగుపెట్టడం జరిగింది. ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఉన్న వయసు..  ప్రేమించడానికి పనికి రాదా...? ఒక వేళ ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారనే ముఖ్యాంశాలు ఈ ప్రేమజంట సినిమాలో చూపించాం. సహజంగా తీసిన కథాంశం కనుకే సహజంగా ఉన్న యాక్టర్స్‌ని తీసుకున్నాం. మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. నిర్మాత మహేష్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగి తీరుతుంది. అది ఈ నెల 28న సినిమా విడుదలైన తరువాత మీకే అర్థం అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. 

హీరోయిన్ సుమయ‌ మాట్లాడుతూ.. ‘‘నాకు యాక్టింగ్ లో జీరో నాలెడ్జ్. కానీ డైరెక్టర్ సర్ ఎంతో ప్రోత్సహించారు. అందరం కష్టపడి పనిచేసాము. మా కష్టం యెక్క ఫలితం దాని తాలూకు విజయం సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. 

ప్రసన్నకుమార్, టిక్ టాక్ దినేష్, బెంజ్ బాబు, సురేష్ శెట్టిపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sponsored links

Prema Janta Movie Pre Release Function:

Celebrities speech at Prema Janta Movie Pre Release Function

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019