‘దర్పణం’ సెన్సార్‌కు రెడీ..!

Wed 19th Jun 2019 08:39 PM
darpanam,darpanam movie,censor,tanishq reddy,ramakrishna vempa  ‘దర్పణం’ సెన్సార్‌కు రెడీ..!
Darpanam Ready to Censor ‘దర్పణం’ సెన్సార్‌కు రెడీ..!
Sponsored links

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం ‘ద‌ర్ప‌ణం’. రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఈ సందర్భంగా డైరెక్టర్ రామ‌కృష్ణ వెంప మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అని స‌స్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ గారి సహకారం మర్చిపోలేనిది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది’’ అన్నారు. 

నిర్మాత క్రాంతి కిర‌ణ్ వెల్లంకి మాట్లాడుతూ.. ‘‘చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాము. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము.  వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుంది అన్నారు. 

కెమెరామెన్: స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్: స‌త్య‌గిడుతూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్: సిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్: క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, డైరెక్ట‌ర్: రామ‌కృష్ణ‌ వెంప‌.

Sponsored links

Darpanam Ready to Censor:

Darpanam Movie Latest update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019