అమలా బోల్డ్ టీజర్‌పై సమంత రియాక్షన్!

Wed 19th Jun 2019 11:07 AM
aadai teaser,amala paul,samantha,reaction  అమలా బోల్డ్ టీజర్‌పై సమంత రియాక్షన్!
Samantha Reaction on Aadai Teaser అమలా బోల్డ్ టీజర్‌పై సమంత రియాక్షన్!
Sponsored links

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆడై’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మంగళవారం బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ రిలీజ్ చేశారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 214,373 వ్యూస్ దక్కించుకోవడంతో పాటు పలువురు ప్రముఖ నటీనటుల ప్రశంసలు అందుకుంటోందీ టీజర్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తూ టాప్ హీరోయిన్‌గా ఉన్న సమంత అక్కినేని.. ఈ టీజర్‌‌పై రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా తన తోటి నటీనటులు నటించే సినిమాలపై స్పందిస్తూ.. టీజర్స్, ట్రైలర్స్, ఫస్ట్‌లుక్‌లపై తన అభిప్రాయాన్ని వెల్లడించే సమంత.. ‘ఆడై’ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘ఆడై’ టీజర్ చాలా అద్భుతంగా ఉందని అమలాపాల్‌కు సామ్ కితాబిచ్చారు. అంతేకాదు.. ఆల్ ది బెస్ట్ అమలా.. అంటూ ఈ టాలీవుడ్ హీరోయిన్ చెప్పుకొచ్చారు. నిజంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు తాను ఈ సినిమా చూస్తానా..? అనే ఆతృత తనలో పెరిగిందని, సినిమా ఎలా ఉంటుంది..? సినిమా కథేంటి..? సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సమంత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.. టీజర్ రిలీజ్ అనంతరం తన ట్విట్టర్ వేదికగా అమలాపాల్.. ‘‘నేను మీ ప్రేమ, అభిమానంతో మరో ప్రయాణం మొదలు పెట్టాను.. మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు కావాలి.. త్వరలో ‘ఆడై’ విడుదల కాబోతోంది’’ అని అమలాపాల్‌ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు స్పందించిన సమంత పై విధంగా తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. అయితే ఈ టీజర్‌ను పలువురు నెటిజన్లు అమలాపాల్ మరీ బోల్డ్‌గా ఉందేంటబ్బా అని విమర్శలు సైతం గుప్పిస్తున్నారు.

Sponsored links

Samantha Reaction on Aadai Teaser:

Amala Paul acted Aadai Teaser released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019