‘ఓ బేబీ’ చూసిన చైతు రియాక్షన్ ఇదే!

Mon 17th Jun 2019 09:13 PM
naga chaitanya,watch,o baby movie,samantha  ‘ఓ బేబీ’ చూసిన చైతు రియాక్షన్ ఇదే!
Chaitu Reaction After O Baby Movie Watch ‘ఓ బేబీ’ చూసిన చైతు రియాక్షన్ ఇదే!
Sponsored links

తమిళంలో ‘సూపర్ డీలక్స్’, తెలుగులో ‘మజిలీ’ సినిమాలతో వరస విజయాలు అందుకున్న అక్కినేని సమంత లేటెస్ట్ గా ‘ఓ బేబీ’ అనే చిత్రం చేసింది. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈసినిమాలో సామ్ భిన్నమైన రోల్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

ట్రైలర్ వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సామ్ కి సపరేట్ మార్కెట్ ఉంది కాబట్టి ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని టాక్. అయితే సామ్ చేసే ప్రతి చిత్రం రిలీజ్ కి ముందుగానే చూసే తన భర్త నాగ చైతన్య ఈచిత్రాన్ని కూడా రిలీజ్ కి ముందే చూశాడట.

ఈసినిమా చూస్తున్నంతసేపు చైతు బాగా ఎంజాయ్ చేశాడట. సినిమా బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడట. అంటే సమంత చెప్పిన్నట్టు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాయని అర్థమవుతోంది. జూలై 5 న ఈమూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఒక కొరియన్ మూవీకి రీమేక్ గా వస్తుంది. ఇక ఈచిత్రాన్ని సురేష్ బాబు, సునీతా తాటి సంయుక్తంగా నిర్మించారు. సామ్ ప్రస్తుతం 96 మూవీ రీమేక్ లో నటిస్తుంది.

Sponsored links

Chaitu Reaction After O Baby Movie Watch:

Naga Chaitanya Watched O Baby Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019